Post Office Best Scheme.
IPPB: పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. ఏడాదికి కేవలం రూ. 299 కడితే రూ.10 లక్షల వరకు బీమా.
కేంద్ర ప్రభుత్వం(Central Govt) ప్రజల సంక్షేమం కోసం పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా అనేకరకాలైన ప్రమాద బీమా(Accident Insurance) పాలసీలను అందిస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగా తపాలా శాఖ(Postal Department)కు చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) తక్కువ ధరకే 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్' స్కీమ్ అందిస్తోంది. ఈ పథకం కింద పాలసీదారు ఏడాదికి రూ. 299 చెల్లిస్తే సరిపోతుంది. ఈ పాలసీ తీసుకున్న వారు ప్రమాదంలో మరణించినా.. యాక్సిడెంట్ లో శాశ్వతంగా వైకల్యం పొందినా రూ.10 లక్షలు పాలసీ డబ్బు ఇస్తారు.
అంతే కాకుండా ప్రమాదంలో కాళ్లు,చేతులు పనిచేయకుండా పోయినా బాధితుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.10 లక్షల బీమా లభిస్తుంది. అలాగే మెడికల్ ఖర్చుల కోసం రూ. 60,000 చెల్లిస్తారు. కాగా 18 నుంచి 65 సంవత్సరాల వయసున్న వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. సూసైడ్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఎయిడ్స్, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, మిలటరీ సర్వీసెస్ లో ఉంటూ మరణించినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. ఈ పాలసీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలంటే మీ సమీపంలోని పోస్టాఫీస్ లేదా https://www.ippbonline.com/web/ippb అనే వెబ్‌సైట్ ను సందర్శించగలరు.