How to exchange damaged notes

 How to exchange damaged notes

 కరెన్సీ నోట్లు చిరిగి పోయినవి ఉన్నాయా . ఫ్రీగా మార్చుకొనే విధానం.

How to exchange damaged notes

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన డిజిటల్ పేమేంట్స్ హవా అనేది జోరుగా కొనసాగుతుంది. అయినప్పటికి చాలామంది వారి నిత్యవసరాల పనుల్లో భాగంగా.. భౌతిక కరెన్సీను వినియోగిస్తూ ఉంటారు.అందుకోసం చాలామంది ఏటీఎంలు, బల్క్ పేమెంట్ లు ఇతరతర వాటి నుంచి డబ్బులను తీసుకుంటారు.

అయితే ఇలా తీసుకునే సమయంలో.. కొన్ని నోట్లు అనేవి బాగా నలిగిపోయి, చిరిగిపోయి ఉంటాయి. ఇక వాటిని అనుకోకుండ.. మనం తీసేసుకుంటాం. కాగా, ఈ పరిస్థితి అనేది అన్ని దగ్గర్ల ఎదురవుతూ ఉంటుంది. ఉదహరణకు ఏదైనా షాపుకు వెళ్లిన, ప్రయాణించినప్పుడైనా.. ఇలా ఎక్కడబడితే అక్కడ చీరిగిపోయినా నోట్లను మనకి ఇచ్చేస్తుంటారు. అయితే పని హడవిడిలో పడిపోయి వాటిని మనం చూడకుండా తీసుకుంటాం. ఇక తిరిగ్గా చూసే సమయానికి చిరిగిపోయిన నోటు మన దగ్గర కనిపిస్తుంది. అయితే దానిని తిరిగి ఎవరికి ఇవ్వాలేక, దాచుకోలేక, ఖర్చుపెట్టాలేక సతమతమవుతూ ఉంటాము. ఇలా రోజువారీ లావాదేవీల చెలామణిలో చేర్చడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే ఆ చిరిగిపోయినా నోట్లను చాలా సులభంగా ఫ్రీగా అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని చాలామందికి తెలియదు. ఇంతకి ఎక్కడంటే..

సాధారణంగా చిరిగిపోయినా, దెబ్బతిన్న కరెన్సీ నోట్లను చాలామంది అనుకోకుండా తీసుకుంటారు. కానీ, తీరా వాటిని చూసేకా అయ్యే ఎక్కడ ఈ చిరిగిపోయిన నోట్లను తీసుకున్నామో అనవసరంగా చూసుకోలేకపోయాం అని తెగ బాధపడుతుంటారు. కాగా, ఆ సమయంలో ఆ నోట్లను ఎవరికి ఇవ్వాలేక, దాచుకోలేక, ఖర్చుపెట్టాలేక సతమతమవుతూ ఉంటాము. కానీ, ఆ చిరిగిపోయినా నోట్లను భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మార్పిడి చేసి సులభంతరం చేస్తుందని చాలామందికి వ్యక్తులకు తెలియదు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంపై స్పష్టమైన మార్గదర్శకాలను అందించింది. ఆర్‌బీఐ నోట్ల మార్పిడి విషయంలో పేర్కొన్న నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.

దెబ్బతిన్న నోట్లను మార్చకోవడం ఎలా అంటే..

నాసిరకం నోట్లు, మురికిగా కొద్దిగా చిరిగిపోయినవి, అలాగే రెండు చివర్లలో సంఖ్యలను కలిగి ఉన్న నోట్లు, అంటే రూ.10, అంతకంటే.. ఎక్కువ విలువ కలిగిన రెండు ముక్కలుగా ఉండే నోట్లను కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మురికి నోట్లుగా పరిగణిస్తారు.

తడిసిన నోట్ల మార్పిడి

తడిచిన నోట్లను కూడా ఈజీగా మార్చుకోవచ్చు. అలాగే నోట్లలో కటింగ్ నంబర్ ప్యానెల్‌ల గుండా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే.. ఆ నోట్ల అన్నింటినీ ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకు శాఖ, ప్రైవేట్ రంగ బ్యాంకుకు సంబంధించిన.. కరెన్సీ చెస్ట్ బ్రాంచ్, ఆర్‌బీఐకు సంబంధించిన ఏదైనా ఇష్యూ కార్యాలయంలో కౌంటర్లలో మార్చుకోవచ్చు. అయితే వీటిని ఎక్స్చేంజ్ చేయడానికి ఎలాంటి ఫారమ్‌ను పూరించాల్సిన అవసరం లేదు.

మ్యుటిలేటెడ్ నోట్లు

అనగా ముక్కలుగా ఉన్న, ముఖ్యమైన భాగాలు లేని నోట్‌లను కూడా మార్చుకోవచ్చు. కాగా, ఈ కరెన్సీ నోట్ లలో ముఖ్యమైన భాగాలు జారీ చేసే అధికారం పేరు, హామీ, వాగ్దాన నిబంధన, సంతకం, అశోక స్తంభం చిహ్నం/మహాత్మా గాంధీ చిత్రపటం, వాటర్‌మార్క్ లేకపోయినా నోట్ల మార్చడానికి వీలవుతుంది. అయితే, ఈ నోట్ల రీఫండ్ విలువ ఆర్‌బీఐ (నోట్ రీఫండ్) నిబంధనల ప్రకారం చెల్లిస్తారు. కనుక ఎటువంటి ఫారమ్‌ను పూరించకుండా ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ బ్రాంచ్, ఏదైనా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌నకు సంబంధించిన ఏదైనా కరెన్సీ చెస్ట్ బ్రాంచ్ లేదా ఆర్‌బిఐ యొక్క ఏదైనా ఇష్యూ ఆఫీసు కౌంటర్లలో కూడా వీటిని మార్చుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ సమచారం తెలియక నోట్లను మార్చలేక సతమతమవుతున్న వారు వెంటనే ఈ మీ దగ్గర ఉన్న నాసిరకమైన నోట్లను ఎక్స్చేంజ్ చేయించుకోండి. మరి, ఆర్‌బీఐ నోట్ల మార్పిడి విషయంలో పేర్కొన్న నిబంధనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.