What to do to prevent websites from storing what you are doing on a smartphone..?
స్మార్ట్‌ఫోన్‌లో మీరేం చేస్తున్నారో వెబ్‌సైట్‌లు స్టోర్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ ద్వారా అనేక పనులు చక్కబెట్టేస్తున్నాం. బ్యాంకింగ్ వ్యవహారాల నుంచి షాపింగ్, టికెట్ల రిజర్వేషన్ సహా ఇతర పనులను స్మార్ట్‌ఫోన్ ద్వారా చేస్తున్నాం. దీంతోపాటు ఏదైనా సమాచారం కోసం అనేక వెబ్‌సైట్‌లను చూస్తుంటాం. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్ని వెబ్‌సైట్‌లు మీ సమాచారాన్ని స్టోర్ చేస్తుంటాయి. అంటే మీరు వెబ్‌సైట్‌లో ఏయే వివరాలు చూశారో వంటి సమాచారాన్ని కొన్ని వెబ్‌సైట్‌లు స్టోర్ చేసే అవకాశం ఉంది.
అయితే వ్యక్తిగత భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారికి ఈ అంశం కొంత ఆందోళన కలిగించవచ్చు. అయితే వెబ్‌సైట్‌లో మీ డేటాను స్టోర్ చేయకుండా ఉండేందుకు స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్‌లో కొన్ని సెట్టింగ్స్‌ను మార్పుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా అప్పటి నుంచి ఏ వెబ్‌సైట్ కూడా మీ సమాచారాన్ని (Internet History) స్టోర్ చేసే అవకాశం ఉండదు.
మీరు పబ్లిక్ కంప్యూటర్ లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని సేకరిస్తుంటే మాత్రం ఈ సెట్టింగ్స్‌ను మార్చుకోవడం ఉత్తమం. మీ స్మార్ట్‌ఫోన్ నుంచే ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేయవచ్చు. ఇందుకోసం మీ స్మార్ట్‌ఫోన్‌లోని గూగుల్ బ్రౌజర్‌ను (Google Chrome Browser) ఓపెన్ చేయాలి. అనంతరం కుడివైపున పైనున్న (Top Right) మూడు చుక్కల క్లిక్ చేయండి.
అనంతరం సెట్టింగ్స్‌పైన ట్యాప్ చేయండి. మరియు కిందకు స్క్రోల్ చేయండి. ఆ తర్వాత సైట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయాలి. అందులో ఆన్ డివైస్ సైట్ డేటా (On Device Site Data) అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అక్కడ కనిపించిన బటన్‌ను ఆఫ్ చేయాలి. దీంతో మీ సమాచారాన్ని ఏ వెబ్‌సైట్ కూడా స్టోర్ చేసే అవకాశం ఉండదు.
దీంతోపాటు స్మార్ట్‌ఫోన్ కొన్నిసార్లు హ్యాంగ్ అవుతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. స్టోరేజీ నిండిపోవడం సహా యాప్ క్యాచీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు సహా అనేక అంశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్ వివిధ అవసరాల కోసం అనేక యాప్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంటాం. అయితే అనంతరం ఆ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం మర్చిపోతుంటాం. ఇలాంటి పొరపాట్ల వల్ల స్మార్ట్‌ఫోన్ స్టోరేజీ నిండి హ్యాంగ్ అయ్యే అవకాశం ఉంది.
స్మార్ట్‌ఫోన్ సంస్థలు సుమారు 2 నుంచి 5 అంతేకంటే ఎక్కువ సంవత్సరాలపాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు అందిస్తాయి. వీటిలో ఆండ్రాయిడ్, సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఉంటాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఫోన్ హ్యాంగ్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. యాప్ క్యాచీ కారణంగా హ్యాండ్‌సెట్ పనితీరుపై ప్రభావం పడుతుంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు యాప్ క్యాచీని వెంటనే తొలగించాలి.
అక్టోబర్ 3వ తేదీన గూగుల్ ఫర్ ఇండియా పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో AI సహా అనేక అంశాలపై కీలక ప్రకటనలు చేసింది. గూగుల్ లైవ్‌ను హిందీలోనూ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, ఉర్దూ వంటి ప్రాంతీయ భాషలను సపోర్టు చేస్తుందని పేర్కొంది.
దీంతోపాటు గూగుల్ మ్యాప్స్‌లో కొన్ని అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. దీంతో మంచు, వరదల సమయాల్లో వాహనదారులకు రియల్‌టైం అప్‌డేట్ అందిస్తాయి. దీంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గూగుల్ మ్యాప్స్‌లోకి 170 మిలియన్‌ల నకిలీ రివ్యూలను తొలగించినట్లు గూగుల్ తన 10వ ఎడిషన్ గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌లో పేర్కొంది.