This is what luck means. If he draw Rs.500.. there crores.
అదృష్టం అడ్డం తిరగడం అంటే ఇదే.. 500 డ్రా చేస్తే కోట్లు.. తీరా చూస్తే షాక్..
ఎటిఎంలో డబ్బులు విత్ డ్రా చేసాక ఒకోసారి బ్యాలెన్స్ చెక్ చేస్తుంటాం... అయితే మీరు కలలు కన్నట్టుగా సడన్ గా మీ అకౌంట్లో కోటి రూపాలు వచ్చి పడితే ఎలా ఉంటుంది... అబ్బహ్ మన అదృష్టమే మారిపోతుంది అనుకుంటారు కదా.. అచ్చం ఇలాంటి సిన్ నిజంగానే జరిగింది... అది కూడా కోటి కాదు ఏకంగా కోట్లు వచ్చి పడ్డాయి అకౌంట్లోకి...
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 9వ తరగతి విద్యార్థి తన బ్యాంకు బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటంటే బీహార్‌లోని సక్రా బ్లాక్‌లోని చందన్ పట్టికి గ్రామానికి చెందిన సైఫ్ అలీ అనే విద్యార్థి మని విత్‌డ్రా చేసేందుకు స్థానిక సైబర్ కేఫ్‌కు వెళ్లినప్పుడు ఈ షాకింగ్ సంఘటన జరిగింది.
వివరాలు చూస్తే సైఫ్ అలీ రూ.500 విత్ డ్రా కోసం స్థానిక సైబర్ కేఫ్‌కు వెళ్ళాడు. అయితే అక్కడ విత్ డ్రా తరువాత అతను స్క్రీన్‌పై ఉన్న బ్యాలెన్స్ రూ. 87.65 కోట్లు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
సైఫ్ అలాగే ఆ సైబర్ కేఫ్ యజమాని ఇద్దరూ మొదట షాక్ అయ్యారు తరువాత అది పొరపాటుగా చూపిస్తుందని భావించారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మళ్ళీ అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేసారు, అయినా కూడా అదే మొత్తం చూపించింది. దీన్ని చూసి ఆశ్చర్యపోయిన సైఫ్ వెంటనే ఇంటికి వెళ్లి తన తల్లితో చెప్పాడు.
ఏం జరిగిందో అర్థంకాక సైఫ్ తల్లి గ్రామంలోని ఇతరులకు సమాచారం అందించింది. బ్యాంక్ స్టేట్‌మెంట్ కోసం కస్టమర్ సర్వీస్ పాయింట్ (సిఎస్‌పి)కి వెళ్లిన బాలుడు రూ.87.65 కోట్ల బ్యాలెన్స్ ఇప్పుడు లేదని తెలుసుకున్నాడు. అలాగే స్టేట్‌మెంట్లో ఇప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉండాలో సరైన బ్యాలెన్స్ రూ. 532గా చూపించింది.
ఈ వింత సంఘటన ఐదు గంటలపాటు కొనసాగింది, ఆ సమయంలో సైఫ్‌కు తెలియకుండానే అదృష్టావంతుడు అయ్యాడు. ఎలా అయితే అకౌంట్లో డబ్బు చూపించిందో అలాగే రహస్యంగా అదృశ్యమైంది. సైఫ్, అతని కుటుంబం ఈ సమస్యను తెలిపేందుకు బ్యాంక్ వెళ్ళినపుడు అకౌంట్లో వచ్చిన మొత్తం డబ్బు మాయమైందని అలాగే బ్యాలెన్స్ సాధారణ స్థితికి వచ్చిందని తెలిపారు.
ఈ ఘటన తర్వాత నార్త్ బీహార్ గ్రామీణ బ్యాంక్ సైఫ్ అకౌంట్లో పొరపాటున ఇంత పెద్ద మొత్తం ఎలా జమ అయిందనే దానిపై ఇంటర్నల్ ఎంక్వేయిరీ ప్రారంభించింది. అయితే ఈ తప్పు ఎలా జరిగిందన్నదానిపై లేదా దీని వెనుక ఎవరు ఉన్నారనే దానిపై బ్యాంకు అధికారులు ఇంకా స్పష్టమైన వివరణ ఇవ్వలేదు.
సైబర్ డిఎస్పీ సీమా దేవి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు, డబ్బు దుర్వినియోగానికి సంబంధించినవి ఎక్కువగా సైబర్ మోసాల ద్వారా జరుగుతాయని, ఖచ్చితంగా ఇది అసాధారణం కాదని అన్నారు. కొంత కాలంగా విద్యార్థి అకౌంట్లో సైబర్ దుండగులు దోపిడీకి పాల్పడి తప్పుగా జమ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే, సైఫ్ లేదా అతని కుటుంబ సభ్యులు సైబర్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా దీనిపై ఫిర్యాదు చేయలేదని ఒక ఇంగ్లీష్ న్యూస్ నివేదించింది.