Tirumala Laddu controversy- Prakash Raj's video on Pawan's comments, hero Surya Deeksha

 Tirumala Laddu controversy- Prakash Raj's video on Pawan's comments, hero Surya Deeksha

Tirumala Laddu controversy- Prakash Raj's video on Pawan's comments, hero Surya Deeksha  Tirumala Laddu Row :

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదం- పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ వీడియో, హీరో సూర్య దీక్ష.

Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదం మరో టర్న్ తీసుకుంది. లడ్డూ విషయంలో నటుడు ప్రకాశ్ రాజ్, హీరో కార్తి వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, దేశానికి తిరిగి వచ్చాక పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నలకు సమాధానమిస్తానన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో వీడియో విడుదల చేశారు. "ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశాను. నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు. ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్‌లో ఉన్నాను. ఈ నెల 30న ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాను. ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్‌ను మరోసారి చదవండి. అర్థం చేసుకోండి" అని ప్రకాశ్ రాజ్ అన్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ స్టార్ హీరో కార్తి చేసిన ఓ కామెంట్‍పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జోకులు వేయడం సరికాదంటూ, మాట్లాడే ముందు వందసార్లు ఆలోచించుకోవాలన్నారు. దీనిపై కార్తి వెంటనే స్పందించారు. వివరణ ఇస్తూ ట్వీట్ చేశారు.

కార్తి క్షమాపణలు:

తన మాట అపార్థానికి కారణమైనందుకు క్షమాపణ అంటూ కార్తి ట్వీట్ చేశారు. తాను వేంకటేశ్వర స్వామికి భక్తుడినని పేర్కొన్నారు. "పవన్ కల్యాణ్ మీపై నాకు పూర్తి గౌరవం ఉంది. నా వ్యాఖ్యలు ఏదైనా అనుకోని అపార్థానికి కారణమై ఉంటే క్షమాపణలు చెబుతున్నా. వేంకటేశ్వర స్వామికి పరమ భక్తుడిగా నేను మన సంప్రదాయాలను ఎప్పుడూ పాటిస్తాను” అని కార్తి ట్వీట్ చేశారు.

సత్యం సుందరం ప్రీ-రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‍లో జరిగింది. ఈ ఈవెంట్‍లో కొన్ని మీమ్స్ చూపిస్తూ.. స్పందించాలని కార్తిని యాంకర్ అడిగారు. ఈ క్రమంలో లడ్డూ కావాలా నయా అంటూ ఓ మూవీలోని డైలాగ్ వచ్చింది. దీని గురించి మాట్లాడాలంటూ కార్తితో యాంకర్ అన్నారు. దీంతో కార్తి స్పందించారు. “ఇప్పుడు లడ్డూ గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు వద్దు మనకు అది” అని కార్తి చెప్పారు. మోతీచూర్ లడ్డూ తెప్పిస్తామని యాంకర్ అంటుంటే ఆ విషయం మాట్లాడవద్దని కార్తి చెప్పారు.

హీరో సూర్య మూడు రోజుల దీక్ష:

కార్తి వ్యాఖ్యల ఘటనపై ఆయన సోదరుడు హీరో సూర్య స్పందించారు. ఇటీవ‌ల ఆడియో ఫంక్షన్‌లో ల‌డ్డూపై తన సోదరుడు కార్తి చేసిన వ్యాఖ్యల‌కు చింతిస్తున్నానని ట్వీట్ చేశారు. త‌మ్ముడి వ్యాఖ్యల నేపథ్యంలో తాను కూడా 3 రోజులు దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ట్విట్టర్ లో పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేస్తూ సూర్య ట్విట్ చేశారు.

తిరుమల లడ్డూ అంశాన్ని సెన్సిటివ్ అనడంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సినిమా ఫంక్షన్‍లో లడ్డూ విషయంలో జోకులు వేశారని, సెన్సిటివ్ అంశం అన్నారని కామెంట్స్ చేశారు. నటులుగా తాను గౌరవిస్తానని, అయితే సనాతన ధర్మం విషయానికి వస్తే ఒక్క మాట మాట్లాడేందుకు వందసార్లు ఆలోచించాలని అన్నారు. ఈ విషయం పెద్దది కాకముందే కార్తి క్షమాపణలు చెప్పారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.