Stomach bloated with gas.. Get rid of it with these tips!

Stomach bloated with gas.. Get rid of it with these tips!

Stomach bloated with gas.. Get rid of it with these tips!

Gas Relief Tips: గ్యాస్‌తో కడుపు ఉబ్బి పోయిందా.. ఈ చిట్కాలతో మాయం!

చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో గ్యాస్ కూడా ఒకటి. గ్యాస్ కారణంగా పొట్ట అంతా ఉబ్బి పోయినట్లుగా అనిపిస్తుంది. కొంత మందిలో నొప్పి కూడా వస్తుంది. ఎలాంటి పనులు చేయలేం. సరైన సహాయంలో ఆహారం తీసుకోకపోవడం.. తిన్న ఆహారం అరగక పోవడం కారణంగా గ్యాస్ సమస్య తలెత్తుతుంది. అదేవిధంగా మసాలా ఉన్న పదార్థాలు కూడా అధికంగా తినడం వల్ల కూడా ఈ గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు తినడం.. రోజూ ఒకే సమయానికి తినకపోవడం వల్ల జీర్ణ శక్తి అనేది పాడవుతుంది. దాని వల్లే కడుపులో గ్యాస్ తయారై చాలా రకాల ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. ముఖ్యంగా గ్యాస్ వల్ల వచ్చే ఛాతి నొప్పి అంతా ఇంతా కాదు. జంక్ ఫుడ్స్ తినడం వలన కూడా సమస్యలకు ప్రధాన కారణం. అలాగే మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యల వల్ల కూడా అదనంగా గ్యాస్ తయారై తీవ్రమైన నొప్పి రావచ్చు. కానీ కడుపులో గ్యాస్ తయారవ్వడం అనేది ఓ సహజమైన ప్రక్రియ. కానీ దాన్ని అడ్డుకోలేక పోయినప్పటికీ తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల ఈ గ్యాస్ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ గ్యాస్ ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

పుదీనా:

పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనాతో చాలా వరకు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం తగ్గించుకోవడానికి కూడా పుదీనా చక్కగా పని చేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు పుదీనా నమిలినా.. రసం తాగినా సరిపోతుంది.

అల్లం:

అల్లంతో కూడా గ్యాస్ సమస్యలు, కడుపు ఉబ్బరాన్ని తగ్గించుకోవచ్చు. అల్లంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. గ్యాస్ అనిపించినప్పుడు అల్లం రసం తాగినా.. చిన్న ముక్క నమిలినా గ్యాస్ తగ్గుతుంది.

జీలకర్ర:

గ్యాస్‌ను తగ్గించాలంటే జీలకర్ర కూడా చక్కగా సహాయ పడుతుంది. దీంతో గ్యాస్ ట్రబుల్, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

సోంపు:

గ్యాస్ సమస్యలను తగ్గించడంలో సోంపు ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఆహారం తిన్న తర్వాత సోంపు నమిలిన తర్వాత గ్యాస్ సమస్యలు, ఇతర జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

లవంగాలు:

భోజనం చేసిన తర్వాత లవంగాలను నమలడం వల్ల జీర్ణ సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇది అసిడిటీని, గ్యాస్‌ని తగ్గించడంలో చక్కగా పని చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు apteachers9.com బాధ్యత వహించదు.)

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.