Cancer: These changes in the tongue.? Can be mouth cancer..

 Cancer: These changes in the tongue.?  Can be mouth cancer..

Cancer: These changes in the tongue.?  Can be mouth cancer..

Cancer: నాలుకలో ఈ మార్పులా.? నోటి క్యాన్సర్‌ కావొచ్చు..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మారిన జీవిన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా క్యాన్సర్‌ భారిన పడుతోన్న వారిన సంఖ్య పెరుగుతోంది. అయితే క్యాన్సర్‌ను త్వరగా గుర్తిస్తే దానికి చికిత్స కూడా అందించడం సులభతరమవుతుంది. అందుకే కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా క్యాన్సర్‌ను అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇండియా ఎగైనెస్ట్ క్యాన్సర్ నివేదిక ప్రకారం, భారతదేశంలో సుమారు 27 లక్షల మంది క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్నారు. వీరిలో 2020లో 8.5 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారు. ఇలాంటి ప్రమాదకరమైన క్యాన్సర్‌ను ముందుగా గుర్తించడం ద్వారా చికిత్స అందించవచ్చు. భారీగా పెరుగుతోన్న క్యాన్సర్‌లో నోటి క్యాన్సర్‌ ఒకటి. ఇంతకీ నోటి క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడ తెలుసుకుందాం..

నాలుక రంగు ఉన్నపలంగా అకస్మాత్తుగా నల్లగా మారడం ప్రారంభించే అది గొంతు ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లక్షణంగా భావించవచ్చు. డయాబెటిస్‌ వ్యాధిగస్తుల నాలుక రంగు మారుతుంది. ఇక క్యాన్సర్‌తో బాధపడేవారిలో కూడా నాలుక రంగు నల్లగా మారడం ప్రారంభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. కడుపులో అల్సర్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నాలుక రంగు నల్లగా మారుతుంది.

ఇక నోటి క్యాన్సర్‌ మరిన్ని ప్రధాన లక్షణాల్లో దంతాలు వదులుగా మారడం, మెడ చుట్టూ గడ్డగా మారినట్లు కనిపించడం, పెదవిపై వాపు లేదా గాయం నయం కాకపోవడం వంటివి కూడా నోటి క్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక తీసుకుంటున్న ఆహారం మింగడంలో ఇబ్బందిగా అనిపించినా.. మాటలో మార్పు, నోటిలో రక్తస్రావం లేదా తిమ్మిరి, ఎలాంటి కారణం లేకుండా ఉన్నపలంగా బరువు తగ్గడం వంటివన్నీ నోటి క్యాన్సర్‌కు లక్షణంగా అర్థం చేసుకోవచ్చు.

నోటి క్యాన్సర్‌ రావడానికి ప్రధాన కారణాల్లో స్మోకింగ్‌ లేదా ఆల్కహాల్‌ సేవించడం, హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV), జన్యుపరమైన అంశాలు, నోటి పరిశుభ్రతను పాటించకపోవడం, చిగుళ్ల వ్యాధి, తంబాకును ఎక్కువగా నమలడం వంటివన్నీ నోటి క్యాన్సర్‌ ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.