Seema Chintakaya: If you see these, you must eat them, diabetes and all those diseases are far away

Seema Chintakaya: If you see these, you must eat them, diabetes and all those diseases are far away

Seema Chintakaya: ఇవి కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే, డయాబెటిస్‌‌తో పాటూ ఆ రోగాలన్నీ దూరం.

Seema Chintakaya: If you see these, you must eat them, diabetes and all those diseases are far away Seema Chintakaya: ఇవి కనిపిస్తే కచ్చితంగా తినాల్సిందే, డయాబెటిస్‌‌తో పాటూ ఆ రోగాలన్నీ దూరం.

సీమ చింతకాయాలు ఇప్పటి పిల్లలకు తెలియడం కష్టమే.  ఇప్పటి పెద్దవారికి సీమ చింతకాయలు నోస్టాల్జియా అని చెప్పుకోవాలి. గ్రామాల్లో పెరిగిన వారికి ఇవి బాగా తెలిసినవే. సిటీల్లో ఇవి దొరకడం చాలా కష్టం. నిజానికి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సీమ చింతకాయలను గుబ్బ కాయలు అని కూడా అంటారు. అలాగే జంగిల్ జిలేబి అని పిలుచుకుంటారు. 

మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తర్వాత తీపి ఆహారం తినాలనిపిస్తే సీమ చింతకాయలు తింటే ఎంతో మంచిది. ఇవి ఆరోగ్యానికి అమృతంతో సమానం.  ఆయుర్వేదంలో జంగిల్ జిలేబీని ఔషధంగా ఉపయోగిస్తారు. జంగిల్ జిలేబీని ఇంగ్లీషులో మద్రాస్ థార్న్ అంటారు. సాధారణ భాషలో విలాయతి చింతపండు, గంగా జిలేబీ, తీపి చింతపండు, గంగా చింతపండు వంటి పేర్లతో ప్రజలు దీనిని పిలుస్తారు. తెలుగు వారు మాత్రం సీమ చింతకాయలు, గుబ్బ కాయలు అంటారు. 

పోషకాలు ఇవే

సీమ చింతకాయల్లో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్ సి, ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. 

రుచి ఎలా ఉంటుంది?

సీమ చింతకాయల పుట్టిల్లు మెక్సికోకు చెందినదిగా చెప్పుకుంటారు. అక్కడ్నించే ఇతర దేశాలకు వ్యాపించిందని చెబుతారు. ఇది పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది తీపి, ఆస్ట్రిజెంట్ రుచిని కలిగి ఉంటుంది. ఇది నోట్లో వేసుకున్న వెంటనే కరిగిపోతుంది.

డయాబెటిస్ ఉన్న వారికి

సీమ చింతకాయలు డయాబెటిస్ రోగుల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. జంగిల్ జిలేబీ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. ఈ ఆకుల సారాన్ని తీసుకోవడం వల్ల మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు.

సీమచింతకాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ ను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

సీమ చింతకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రక్త హీనతతో బాధపడుతుంటే వీటిని తింటే ఎంతో ఉపయోగం ఉంటుంది. 

రోగనిరోధక శక్తికి

సీమ చింతకాయలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జంగిల్ జిలేబిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది  యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది.  సీమచింతకాయ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, ఇది పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సీమ చింతకాయలు క్రమం తప్పకుండా తినడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

ఇవి పట్టణాల్లో దొరకడం కష్టమే కానీ గ్రామాల్లో మాత్రం ఈ చెట్లు ఇంకా కనిపిస్తున్నాయి. సీమ చింతకాయ చెట్లు చాలా ఎత్తుగా, గుబురుగా, ముళ్లుతో పెరుగుతాయి. ఎక్కువగా ఇవి అడవుల్లో పెరుగతూ ఉంటాయి. గ్రామ శివారులో ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.