Mint Leaves Benefits

Remove dark circles with mint.. How to use it..

Remove dark circles with mint.. How to use it..

Mint Leaves Benefits: పుదీనాతో డార్క్ సర్కిల్స్ మాయం.. ఎలా వాడాలంటే..

పుదీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుదీనా లేకపోతే పుదీనా పూర్తికాదు. పులావ్ వంటి వంటకాల్లో పుదీనా చాలా ముఖ్యం. దీంతో రుచి మరింత పెరుగుతుంది. అదేవిధంగా ఇతర వంటకాల్లో కూడా పుదీనాను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పుదీనాతో రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అదే విధంగా అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో నిద్ర సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి కారణంగా కళ్ల చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఈ డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో పుదీనా ఎంతో ప్రభావితంగా పని చేస్తుంది. డార్క్ సర్కిల్స్ వల్ల ముఖ అందమే పాడైపోతుంది. ఈ మచ్చలను తగ్గంచడంలో పుదీనా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఉప్పును ఎక్కువగా తినే వారికి కూడా డార్క్ సర్కిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మరి డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి పుదీనాను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనా పేస్ట్:

పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. వీటిని డార్క్ సర్కిల్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా ఓ పావు గంట సేపు ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు కూడా చల్లగా ఉంటుంది. ఈ పేస్టును ముఖంపై కూడా రాసుకోవచ్చు. దీని వల్ల ముఖంపై ఉండే మలినాలు తొలగి అందంగా కనిపిస్తుంది.

పుదీనా ఐస్ క్యూబ్స్:

పుదీనా నుంచి రసం తీసి దీన్ని ఐస్ ట్రేలలో ఉంచి ఫ్రీజ్ చేయాలి. ఆ తర్వాత ఈ ఐస్ క్యూబ్స్‌ని కళ్లపై ఉండే డార్క్ సర్కిల్స్ మీద రాయాలి. ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు అనేవి తగ్గుతాయి. ఈ ఐస్ క్యూబ్స్‌తో ముఖం, కాళ్లు, చేతులపై కూడా మసాజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఫ్రెష్‌గా ఉంటుంది చర్మం. ఇలా తరచూ చేస్తే చక్కటి గ్లో వస్తుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.