Hot Water: Is it good to drink warm water in summer? isn't it

 Hot Water: Is it good to drink warm water in summer?  isn't it

Hot Water: Is it good to drink warm water in summer?  isn't it

Hot Water: గోరువెచ్చని నీరు తాగడం మంచిదా? కాదా?

ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి నీరు ముఖ్యం. శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అయితే చాలామంది చల్లని నీరు తాగడానికి ఇష్టపడతారు. కానీ వేడి నీరు తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఉదయాన్నే వేడి నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. 

జీర్ణ సమస్యలు

కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి వేడి నీరు బాగా సాయపడుతుంది. తిన్న ఆహారం జీర్ణం కావడానికి వేడి నీరు ఉపయోగపడుతుంది. 

మలబద్దకం

మలబద్దకం సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు పరిగడుపున వేడి నీరు తాగడం వల్ల నొప్పి లేకుండా సులభంగా విసర్జన అవుతుంది. దీర్ఘకాలికంగా మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది. 

బరువు తగ్గడం

ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగడం వల్ల తొందరగా బరువు తగ్గించడంలో సాయపడటంతో పాటు ఆకలిని నియంత్రిస్తుంది. 

వ్యర్థాలను తొలగిస్తుంది

బాడీలో ఉన్న వ్యర్థ పదార్థాలను పంపించడంలో వేడి నీరు ఉపయోగపడుతుంది. అలాగే రక్త ప్రసరణను పెంచుతుంది. 

ఒత్తిడి నుంచి విముక్తి

ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు ఉన్నవారికి వేడి నీరు బాగా ఉపయోగపడతాయి. వేడి నీరు ఉదయాన్నే తాగడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.