HDFC Scholarship 2024

 HDFC Scholarship 2024 

HDFC Scholarship 2024

ఒకటో తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు- హెచ్డీఎఫ్సీ స్కాలర్ షిప్ లు, ఇలా అప్లై చేసుకోండి

HDFC Parivartan Scholarship 2024 : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పరివర్తన్ సీసీఎస్ఎస్ ప్రోగ్రామ్ 2024-25 భాగంగా స్కాలర్ షిప్ లకు విద్యార్థుల నుంచి దరఖాస్తును ఆహ్వానించింది. 1 నుంచి 12 తరగతుల పాఠశాల విద్యార్థులు, డిప్లొమా, ఐటీడీ, పాలిటెక్నిక్, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లను అభ్యసిస్తున్న పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. విద్యాపరమైన ఖర్చుల కోసం రూ.75,000 వరకు స్కాలర్ షిప్ లు అందిస్తారు. దరఖాస్తులకు అక్టోబర్ 30 చివరి తేదీ.

పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ అర్హతలు

దేశంలో గుర్తింపు పొందిన కాలేజీలు లేదా విశ్వవిద్యార్థాల్లో విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు (ఎం.కాం, ఎంఏ, ఎం.టెక్, ఎంబీఏ) అభ్యసిస్తూ ఉండాలి.

విద్యార్థులు మునుపటి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ.2.5 లక్షల కంటే తక్కువగా లేదా సమానంగా ఉండాలి.

గత మూడు సంవత్సరాలలో వ్యక్తిగత లేదా కుటుంబ సంక్షోభాలను ఎదుర్కొన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

స్కాలర్ షిప్ వివరాలు:

సాధారణ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు- రూ. 35,000.

ప్రొఫెషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు - రూ.75,000.

అవసరమయ్యే పత్రాలు:

  • పాస్‌పోర్ట్ సైజు ఫొటో.
  • మునుపటి ఏడాది మార్క్‌షీట్‌లు (2023-24).
  • గుర్తింపు కార్డు(ఆధార్ కార్డ్/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్).
  • ప్రస్తుత సంవత్సరం అడ్మిషన్ ఫీజు (ఫీజు రసీదు/అడ్మిషన్ లెటర్/ఐడీ కార్డ్/బోనఫైడ్ సర్టిఫికేట్).
  • దరఖాస్తుదారుడి బ్యాంక్ పాస్‌బుక్/క్యాన్సిల్డ్ చెక్.
  • ఆదాయ రుజువు (గ్రామ పంచాయతీ/వార్డు కౌన్సెలర్/సర్పంచ్ జారీ చేసిన ఆదాయ రుజువు /SDM/DM/CO/తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ రుజువు).
  • కుటుంబం/వ్యక్తిగత సంక్షోభం రుజువు (వర్తిస్తే).

ఎలా దరఖాస్తు చేసుకోవాలి:

బడ్డీ4స్టడీ వెబ్ సైట్ లో https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecss-programme లింక్ పై క్లిక్ చేయండి. విద్యా్ర్థులు వారికి వర్తించే స్కాలర్ షిప్ విభాగంలో 'అప్లై నౌ' ఆప్షన్ పై క్లిక్ చేయండి.

మీ రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Studyకి లాగిన్ చేయండి. 'దరఖాస్తు ఫారమ్ పేజీ' ఓపెన్ అవుతుంది.

కొత్తగా నమోదు చేసుకుంటున్న విద్యార్థులు మీ ఇమెయిల్, మొబైల్ లేదా జీ మెయిల్ ఖాతాను ఉపయోగించి Buddy4Studyలో ఖాతాను తెరవవచ్చు.

లాగిన్ అయ్యాక ‘HDFC బ్యాంక్ పరివర్తన్ యొక్క ECSS ప్రోగ్రామ్ 2024-25’ దరఖాస్తు ఫారమ్ పేజీకి వెళ్తారు.

అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి 'అప్లికేషన్ స్టార్ట్' బటన్‌పై క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన వివరాలను నమోదు చేయండి.

సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయండి.

నిబంధనలు అంగీకరించి, ప్రివ్యూపై క్లిక్ చేయండి.

ప్రివ్యూ స్క్రీన్‌పై అన్ని వివరాలు సరిచూసుకుని సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. దీంతో మీ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది.

ఎంపికైన విద్యార్థులకు మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ కు సమాచారం ఇస్తారు.

గ్రాడ్యుయేషన్ కోర్సులు:

విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోర్సులు (B.Com., B.Sc., B.A., B.C.A , B.Tech., M.B.B.S., L.L.B., B.Arch., నర్సింగ్) భారతదేశంలోని గుర్తింపు పొందిన కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలలో అభ్యసిస్తూ ఉండాలి.

విద్యార్థులు మునుపటి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా రూ.2.5 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి.

గత మూడు ఏళ్లలో వ్యక్తిగత లేదా కుటుంబ సంక్షోభాలను ఎదుర్కొన్న విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

స్కాలర్ షిప్ వివరాలు:

అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు- రూ. 30,000

ప్రొఫెషనల్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు- రూ. 50,000

1 నుంచి 12 వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థుల స్కాలర్ షిప్ వివరాలు:

విద్యార్థులు ప్రస్తుతం ప్రభుత్వ లేదా ప్రైవేట్ లేదా ప్రభుత్వ సహాయక పాఠశాలల్లో 1 నుంచి 12 తరగతులలో చదువుతూ ఉండాలి. డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులను అభ్యసిస్తూ ఉండాలి.

దరఖాస్తుదారులు గత పరీక్షల్లో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ లేదా సమానంగా ఉండాలి.

డిప్లొమా కోర్సును అభ్యసిస్తున్న వారికి, 12వ తరగతి తర్వాత డిప్లొమా అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

స్కాలర్ షిప్ వివరాలు:

1 నుంచి 6వ తరగతి వరకు - రూ. 15,000

7 నుంచి 12వ తరగతి వరకు, డిప్లొమా, ఐటీడీ, పాలిటెక్నిక్ విద్యార్థులకు- రూ.18,000

దరఖాస్తు, పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.