Dog Bite: Do this immediately after a dog bite to avoid the risk of rabies

 Dog Bite: Do this immediately after a dog bite to avoid the risk of rabies

Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఈ పని చేయండి, రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు.

Dog Bite: Do this immediately after a dog bite to avoid the risk of rabies Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఈ పని చేయండి, రేబిస్ వచ్చే ప్రమాదం ఉండదు.

కుక్క కరిచిన తరువాత చేయాల్సిన పని:

వీధి కుక్కలు అప్పుడప్పుడు ప్రజలపై దాడి చేసి కరుస్తూ ఉంటాయి. ప్రతిరోజూ ఎంతో మంది కుక్క కాటుకు గురవుతున్నారు. ఈ కుక్క కాటు ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. అది రేబిస్ గా మారి ప్రాణాలను కూడా తీస్తుంది. కాబట్టి కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

రేబిస్ అనేది కుక్క, పిల్లి, నక్క, డేగ కురవడం వల్ల కలిగే సమస్య. రేబిస్ నివారణపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 28 న ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహించుకుంటారు. మొదటి రేబిస్ వ్యాక్సిన్ రూపొందించిన ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ మరణించిన సందర్భంగా ఈ ప్రత్యేక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కుక్క కాటు వేసినప్పుడు మీరు మొదట ఏమి చేయాలో తెలుసుకోండి.

ఇంట్లోని పెంపుడు జంతువులు కరవడం, వీధి కుక్కలు, పిల్లి కరుస్తున్న సంఘటనలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటికి చేయనప్పుడు రేబిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. దీనికి చికిత్స చేయకపోతే, ఇది వ్యక్తికి ప్రమాదకరంగా మారుతుంది. దాని చికిత్స కోసం వెంటనే ఇంజెక్షన్ తీసుకోవడం అవసరం. కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలో తెలుసుకోండి.

కుక్క కరిస్తే:

కుక్క కరిచిన తర్వాత గాయాన్ని సబ్బు తో శుభ్రం చేయండి. దుమ్ము, బ్యాక్టీరియా, లాలాజలాన్ని తొలగించడానికి ఆ గాయాన్ని లిక్విడ్ సోప్ తో పరిశుభ్రం చేయాలి. కుక్క కాటు వల్ల రక్తస్రావం అవుతుంటే పరిశుభ్రమైన వస్త్రంతో మెత్తగా ఒత్తి ఉంచాలి.

ఈ పనులు చేయొద్దు:

కుక్క కరవగానే హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా ఆల్కహాల్ పోయడం వంటి పనులు చేయవద్మాదు. ఎందుకంటే ఇవి గాయాన్ని మరింత చికాకు పెడతాయి. మీరు కుక్క కాటుకు గురైనప్పుడు, టెటనస్ ఇంజెక్షన్ తీసుకోవడం అవసరం. రేబిస్ వ్యాక్సిన్ను ఐదు డోసుల్లో ఇస్తారు. ఇది సాధారణంగా కాటు వేసిన రోజు ఒకటి ఇస్తారు. తరువాత కాటు వేసిన మూడోవ రోజు, ఏడో రోజు, పద్నాలుగో రోజు, 30 వ రోజు ఇస్తారు.

రేబిస్ లక్షణాలు:

కుక్క కరిచిన తరువాత రేబిస్ ఎప్పుడైన తన లక్షణాలను బయటపెడుతుంది. అంతవరకు వేచి ఉండకుండా ముందే రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవడం చాలా అవసరం. రేబిస్ సోకిన తరువాత జ్వరం, తలనొప్పి వంటివి వస్తూ పోతాయి. మెదడుకు సమస్య మొదలవుతుంది. మెనింజైటిస్ వస్తుంది. దీని వల్ల నిద్రలేమి, మానసిక ఆందోళన, మతిస్థిమితం కలగడం, భయభ్రాంతులు కలగడం, పాక్షికంగా పక్షవాతం రావడం వంటివి జరుగుతాయి.

కేవలం కుక్క కరిస్తేనే కాదు, దాని లాలాజలం వల్ల రేబిస్ వచ్చే అవకాశం ఉంది. ఆ కుక్కకు రేబిస్ ఉంటే దాని లాలాజలం ద్వారా ఎదుటి జీవులకు రేబిస్ సోకుతుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం రాబిస్ వల్లే ఏటా 59,000 మంది మరణిస్తున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలోనే కుక్క కాటు సంఘటనలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.