Business Pradhan Mantri Mudra Yojana

Business Pradhan Mantri Mudra Yojana

Business Pradhan Mantri Mudra Yojana

బిజినెస్ పెడుతున్నారా? ప్రభుత్వం లోన్ ఇస్తుందిగా.. ఇలా చేస్తే రూ.10 లక్షలు రుణం!

Pradhan Mantri Mudra Yojana : దేశంలోని నిరుద్యోగ సమస్యకు పరిష్కరించడానికి, వ్యాపారం ప్రారంభించాలనే యువతకు ప్రోత్సహించేందుకు కేంద్ర పభుత్వం ముద్రా లోన్ ఇస్తోంది. దేశంలో యువతకు సరైన విద్య, శిక్షణ, నైపుణ్యం ఉంటే దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పడంలో ఏ అనుమానం లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం స్వతహాగా వ్యాపారం ప్రారంభించాలనుకునే యువతకు ప్రధాన మంత్రి ముద్ర యోజన (PMMY) పథకం తీసుకొచ్చింది.

2015లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. యువతతో ఎంటర్‌ప్రెన్యూర్ నైపుణ్యం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో ఈ స్కీమ్ ని తీసుకొచ్చింది. సొంత వ్యాపారం పెట్టుకోవడమే కాదు.. వ్యాపారాభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం ఈ పథకం కింద రుణం ఇస్తోంది. అయితే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం ప్రకారం.. కార్పొరేట్, వ్యవసాయం సంబంధిత వ్యాపారాల కోసం ఈ రుణం లభించదు.

ఈ పథకం కింద వ్యాపారులకు కనిష్టంగా రూ.50 వేలు, గరిష్టంగా రూ.10 లక్షలు లోన్ లభిస్తుంది. అయితే పథకం కింద రుణం తీసుకోవడం చాలా సులభం. రుణం పొందడానికి సాధారణంగా బంగారం, ఇల్లు, భూమి, కారు లాంటివి ష్యూరిటీ గా చూపించడం లేదా తాకట్టు పెట్టడం జరుగుతుంది. కానీ ఈ పథకం కింద లోన్ తీసుకోవడనికి ఎటువంటి ష్యూరిటీ, గ్యారంటీలు అవసరం లేదు. అందుకే కష్టపడే తత్వం ఉన్న యువత ఈ పథకం కింద రుణం పొంది జీవితంలో ఆర్థిక స్థిరత్వం పొందవచ్చు.

ఈ లోన్ కోసం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు, చిన్న ఫైనాన్స్ బ్యాంకు, లేదా నాన్ ఫైనాన్షయల్ కంపెనీలో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకు లేదా ప్రైవేట్ బ్యాంకు లో ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద మూడు కేటగిరీల్లో రుణం లభిస్తుంది. ఆ కేటగిరీ ప్రకారమే రుణ పరిమితిని నిర్ధారిస్తారు.

1. శిశు లోన్ – ఈ కేటగిరీలో రూ.50 వేల వరకు రుణ పరిమితి ఉంటుంది.

2. కిశోర్ లోన్ – ఈ కేటగిరీలో ముద్రా లోన్ పరిమితి రూ.5 లక్షల వరకు ఉంటుంది.

3. తరుణ్ లోన్ – మూడో కేటగిరీలో అత్యధికంగా రూ.10 లక్షల వరకు లోన్ లభిస్తుంది.

లోన్ తీసుకోవడానికి ఇవే అర్హతలు:

భారతదేశంలో వ్యాపారం ప్రారంభించాలనే ప్రతీ వ్యక్తికి ఈ లోన్ పొందడానికి అర్హత ఉంది. అలాగే ముందుగానే వ్యాపారం ఉన్నవారు వ్యాపార విస్తరణ లేదా అభివృద్ధి కోసం కూడా ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

లోన్ పొందాలనే వ్యక్తి భారత దేశ పౌరడై ఉండాలి.
లోన్ తీసుకోవడానికి ముందు అతను ఏ బ్యాంకులో కూడా రుణం తీసుకొని ఎగవేత చేసిన చరిత్ర ఉండకూడదు.
కార్పొరేట్ రంగంలో వ్యాపారం చేయడానికి లోన్ తీసుకోకూడదు.
ముద్ర లోన్ తీసుకోవాలనే వ్యక్తికి 18 సంవత్సరాల వయసు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
రుణం పొందడానికి ఆ వ్యక్తికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి.

ముద్ర లోన్ వల్ల లాభాలు:

రుణం తీసుకున్నాక ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా 5 సంవత్సరాల లోపు రుణం తిరిగి చెల్లించాలి.
ప్రత్యేక పరిస్థితుల్లో గరిష్టంగా 10 సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాలి.
ముద్రా కార్డులో ఆమోదం పొందిన మొత్తం రుణం పై వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంత మొత్తం రుణం వినియోగించికున్నారో అంతకు మాత్రమే వడ్డీ చెల్లిస్తే చాలు.
వడ్డీ శాతం రుణ పరిమితి ఆధారంగా ఉంటుంది.

ముద్ర లోన్ కు ఎలా దరఖాస్తు చేయాలంటే..

  • ముద్ర పథకం అధికారిక వెబ్ సైట్ mudra.org.in కు వెళ్లండి.
  • అందుతో శిశు, కిశోర్, తరుణ్ కేటగిరీల్లో ఒకటిని ఎంచుకోండి.
  • ఆ తరువాత కొత్త పేజీలో నుంచి అప్లికేషన్ ఫామ్ డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోండి.
  • అప్లికేషన్ ఫామ్ సరైన వివరాలతో నింపండి.
  • ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇంటి అడ్రస్, షాపు అడ్రస్ ఆధారాలు, ఆదాయపు పన్ను రిటర్న్ కాపీలు, పాస్ పోర్ట్ సైజు ఫొటో ఇవన్నీ అప్లికేషన్ ఫామ్ కు జత చేసి మీ బ్యాంకులో ఇవ్వండి.
  • బ్యాంకు అధికారులు వెరిఫై చేసి ఒక నెలలోపు మీకు ముద్ర లోన్ ఆమోదిస్తారు.
  • ఆన్ లైన్ లో రుణం పొందడానికి ముందుగా ఒక యూజర్ నేమ్, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోండి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.