Airtel Payments Bank - NCMC enabled Smart Watch

 Airtel Payments Bank - NCMC enabled Smart Watch

Airtel Payments Bank - NCMC enabled Smart Watch

Smart Watch : ఇకపై ఫోన్‌ అవసరం లేకుండానే.. స్మార్ట్‌వాచ్‌తో పేమెంట్స్‌ చేసేయొచ్చు.. మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌వాచ్‌

Airtel Payments Bank - NCMC enabled Smart Watch : ప్రస్తుతం నడుస్తున్నది డిజిటల్‌ యుగం. అన్నీ పనులు టెక్నాలజీతోనే చేయడం అవుతోంది. పేమెంట్స్‌ విధానం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు చెల్లింపు లావాదేవీలన్నీ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌ల ద్వారానే జరుగుతున్నాయి. ఇంకాస్త ఒక అడుగు ముందకెళ్లి.. స్మార్ట్‌వాచ్‌తోనే పేమెంట్స్‌ చేసే పరిస్థితి వచ్చేస్తోంది. ఒకప్పుడు వాచ్‌ అనేది కేవలం టైమ్‌ తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక గ్యాడ్జెట్ మాత్రమే. కానీ కాలక్రమేణ స్మార్ట్ వాచ్‌ అందుబాటులోకి రావడంతో వాచ్‌ రూపమే మారిపోయింది. ఇప్పుడు వాచ్‌తో చేయలేని పని లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్‌ కాల్‌ మొదలు, హెల్త్‌ ట్రాక్‌ వరకు అన్ని రకాల పనులను వాచ్‌తోనే చేసే రోజులు నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా ఎయిర్‌టెల్ పేమెంట్స్‌, నాయిస్‌ కలిసి మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చింది. తాజాగా గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌‌వాచ్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ ప్రముఖ స్మార్ట్‌‌వాచ్ కంపెనీ నాయిస్‌తో కలిసి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. త్వరలోనే ఈ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (NCMC) టెక్నాలజీకి సపోర్ట్ చేసేలా ఈ వాచ్‌ను డిజైన్ చేశారు. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌లో డైరెక్ట్‌, ‘ఆన్‌ ద గో’ పేమెంట్స్‌ కోసం డయల్‌లో ఎంబెడెడ్ రూపే చిప్‌ను అమర్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్‌సీఎంసీ ఇంటిగ్రేషన్‌తో వచ్చే ఈ స్మార్ట్‌ వాచ్‌ ట్యాప్ అండ్‌ పే లావాదేవీలకు మద్దతునిస్తుంది. ఈ ఇంటిగ్రేషన్ సౌజన్యంతో దేశంలోని మెట్రోలు, బస్సులు, పార్కింగ్ ప్రదేశాలు ఇంకా మరెన్నో చోట్ల స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. పిన్‌తో పనిలేకుండా ఈ స్మార్ట్‌ వాచ్‌ ద్వారా రూ. 5,000 వరకూ పేమెంట్స్‌ చేయొచ్చు.

కేవలం ఫోన్‌ను పేమెంట్‌ విడైజ్‌ దగ్గర టచ్‌ చేస్తే చాలు వెంటనే పేమెంట్ పూర్తవుతుంది. ఇక ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. బాడీ టెంపరేచర్‌, హార్ట్‌ బీట్ రేట్‌, బీపీ చెకింగ్‌, హెల్త్‌ ఫిట్‌నెస్‌ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ వాచ్‌ 130 స్పోర్ట్స్ మోడ్‌లను ట్రాక్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. 150కి పైగా క్లౌడ్-ఆధారిత వాచ్ ఫేస్‌లను కస్టమైజ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. IP68 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. 550 నిట్స్ బ్రైట్‌నెస్‌తో టీఎఫ్‌టీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉందని ఎయిర్‌టెల్ తెలిపింది.

ఈ డివైజ్‌ ఇతర స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగానే స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసినప్పుడు నోటిఫికేషన్‌లు, కాల్ రిమైండర్‌లు, సందేశాలను కూడా ప్రదర్శిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఈ స్మార్ట్‌వాచ్ ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ వాచ్‌ను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.