Why is there a USB-C charging port in the iPhone 15 series? The reason for this is the rules of that country..
ఐఫోన్ 15 సిరీస్‌లో USB-C ఛార్జింగ్ పోర్ట్ ఎందుకు వచ్చింది.. ? ఇందుకు కారణం ఆ దేశ నిబంధనలేనా..
టెక్ కంపెనీ ఆపిల్ కొత్త ఐఫోన్ లైనప్‌ను మంగళవారం ఆవిష్కరించింది. సాధారణంగా ఐఫోన్‌లలో ఉండే లైట్నింగ్ ఛార్జర్ పోర్ట్ కొత్త ఐఫోన్ 15 మోడల్‌లలో టైప్-Cతో రీప్లేస్ చేసింది. ఐరోపా యూనియన్ తీసుకొచ్చిన నిబంధనలే ఇందుకు కారణమని చెబుతున్నారు.
యూరోపియన్ యూనియన్‌లో అమ్మే అన్ని మొబైల్ ఫోన్‌లు 2024 చివరి నాటికి USB-C ఛార్జింగ్ తో ఉండాలని యూరోపియన్ యూనియన్ చెప్పిన తర్వాత, Apple iPhone 15 సిరీస్ మొబైల్‌లకు USB-C పోర్ట్ సౌకర్యాన్ని అందించింది.
USB-C ఛార్జర్‌ల కంటే లైటెనింగ్ ఛార్జర్ చాలా సురక్షితమైనదని ఆపిల్ చాలా కాలంగా వాదిస్తోంది. లైటెనింగ్ ఛార్జర్ ఇతర ఆపిల్ డివైజెస్ లో కూడా ఉపయోగించబడుతుంది. కానీ ప్రపంచంలోని అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ శామ్‌సంగ్‌తో సహా అనేక ఆండ్రాయిడ్ మొబైల్ తయారీదారుల మొబైల్‌లలో USB-C పోర్ట్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది.
"USB-C విశ్వవ్యాప్తంగా ఆమోదించబడింది, కాబట్టి మేము iPhone 15తో USB-Cని తీసుకువస్తున్నాము" అని Apple iPhone మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ ట్రాన్స్ చెప్పారు.
Apple ఐఫోన్‌ల సేల్స్ క్షీణించడం ఇంకా చాలా మంది కాస్ట్ మోడల్‌లకు మారాలని ఆలోచిస్తున్నందున కస్టమర్లను ఆకర్షించడానికి iPhoneలలో USB-C ఛార్జింగ్ పోర్ట్ అందుబాటులోకి వచ్చింది.
ఆపిల్ సంస్థ అమెరికా, చైనాల మధ్య వివాదంలో చిక్కుకుంది. నివేదికల ప్రకారం, చైనాలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వం పౌర సేవకులు (civil servants)ఐఫోన్లను ఉపయోగించకుండా నిషేధించింది.
ఆపిల్ కొత్త ఛార్జింగ్ పోర్ట్‌ల కంటే ఇతర కొత్త ఫీచర్‌లపైనే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. అయితే USB-C పోర్ట్ కి మారడమే పెద్ద వార్త అంటున్నారు గాడ్జెట్ ప్రియులు