Samudrayan after Chandrayaan! Indian scientists to explore the deep sea!

Samudrayan after Chandrayaan! Indian scientists to explore the deep sea!

చంద్రయాన్ తర్వాత సముద్రయాన్ ! లోతైన సముద్రాన్ని అన్వేషించేందుకు భారతీయ శాస్త్రవేత్తలు!

Samudrayan after Chandrayaan! Indian scientists to explore the deep sea!

మూన్ మిషన్ చంద్రయాన్-3 సక్సెస్ తరువాత భారతీయ శాస్త్రవేత్తలు ఇప్పుడు సముద్రయాన్ అనే లోతైన సముద్ర అన్వేషణకు సిద్ధమవుతున్నారు. కోబాల్ట్, నికెల్ ఇంకా మాంగనీస్‌తో సహా విలువైన లోహాలు, ఖనిజాల కోసం శోధించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన సబ్‌మెర్‌సిబుల్‌లో ముగ్గురిని 6,000 మీటర్ల అంటే 6 కిలోమీటర్ల నీటి అడుగునకు  పంపడానికి  ప్రణాళిక చేసింది.

మత్స్య 6000 (Matsya 6000)గా పేరు పెట్టబడిన ఈ  సబ్మేరైన్ దాదాపు రెండేళ్లుగా అభివృద్ధిలో ఉంది. దీనిని  2024 ప్రారంభంలో చెన్నై తీరంలోని బంగాళాఖాతంలో  తొలి సముద్ర పరీక్షను నిర్వహించనుంది. గతనెల జూన్‌లో ఉత్తర అట్లాంటిక్
మహాసముద్రంలో పర్యాటకులను తీసుకెళ్తుండగా టైటానిక్ సబ్ మెర్సిబుల్ అదృశ్యం కావడంతో మత్స్య 6000 డిజైన్‌పై శాస్త్రవేత్తలు నిశితంగా దృష్టి సారించారు.

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) శాస్త్రవేత్తలు మత్స్య 6000ను అభివృద్ధి చేశారు. సబ్ మెరైన్  రూపకల్పన అండ్  టెస్టింగ్  విధానాలను పరీక్షించడానికి శాస్త్రవేత్తలు విస్తృతమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ గురించి, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్  లోతైన సముద్ర అన్వేషణలో భాగంగా సముద్రయాన్ మిషన్ కొనసాగుతోందని, 2024 మొదటి త్రైమాసికంలో 500 మీటర్ల లోతులో సముద్రంలో పరీక్ష నిర్వహిస్తామని రవిచంద్రన్ తెలిపారు.

ఈ పని 2026 నాటికి పూర్తవుతుందని అంచనా. అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనా సహా కొన్ని దేశాలు మాత్రమే మానవ  రహిత సబ్ మెరైన్  ని అభివృద్ధి చేయడం గమనార్హం.

మత్స్య 6000  ప్రధాన లక్ష్యం నికెల్, కోబాల్ట్, మాంగనీస్, హైడ్రోథర్మల్ సల్ఫైడ్లు అండ్ గ్యాస్ హైడ్రేట్ల వంటి విలువైన ఖనిజాల కోసం వెతకడం. ఈ పనిలో బయోడైవర్సిటీ, సముద్రపు మీథేన్ సీప్‌లపై పరిశోధన కూడా ఉంది.

"మత్స్య 6000 డయామీటర్  2.1 మీటర్లు. దీనిని ముగ్గురికి సరిపోయేలా రూపొందించబడింది. ఇంకా 6,000 మీటర్ల లోతులో 600 బార్‌ల అపారమైన ఒత్తిడిని తట్టుకునేలా నిర్మించబడింది. 96 గంటల ఆక్సిజన్ సరఫరాతో 12 నుండి 16 గంటలపాటు నిరంతరం పని చేస్తుంది అని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెరైన్ టెక్నాలజీ డైరెక్టర్ జిఎ రామదాస్ అన్నారు. ఈ  విధంగా ఈ సబ్ మెరైన్ రూపొందించాము " అని ఆయన చెప్పారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.