Do you use mobile phone a lot... But this disease is guaranteed! What are the doctors saying?

 Do you use mobile phone a lot... But this disease is guaranteed! What are the doctors saying?

ఎక్కువగా మొబైల్ ఫోన్ వాడుతున్నారా... అయితే ఈ రోగం గ్యారెంటీ! డాక్టర్స్ ఎం చెబుతున్నారంటే..?

Do you use mobile phone a lot... But this disease is guaranteed! What are the doctors saying?

మొబైల్ లేనిదే జీవితం లేదు.. టక్ టక్ అంటూ మొబైల్ బటన్ నొక్కుతూ కాలక్షేపం చేసే వారు మీరైతే మీ వేలుని కాస్త చూసుకోండి. మీ మితిమీరిన మొబైల్ వ్యసనం మీ వేళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ఉండవచ్చు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ అన్నీ ఆన్‌లైన్‌లోకి మారిపోతున్నాయి. మొబైల్స్, ట్యాబ్స్  వంటి టచ్ స్క్రీన్‌లను ఎక్కువగా వాడుతున్నాం. 

కూరగాయల స్టోర్, పండ్ల షాప్, షాపింగ్ మాల్ ఇలా ఎక్కడికి వెళ్లినా చేతిలో మొబైల్ ఉంటుంది. ఈరోజు మనం చాలా మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లను చూస్తున్నాం. మొబైల్ ఉపయోగించడం ఇప్పుడు ఒక వ్యసనంగా మారుతుంది అది అంత ఇంత కూడా కాదు. అయితే ఈ వ్యసనం మనిషికి అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తోంది.మొబైల్ వాడకం వల్ల వచ్చే సమస్యల్లో ట్రిగ్గర్ ఫింగర్ ఒకటి. మొబైల్ అండ్  ఇతర టచ్ స్క్రీన్ ఉపయోగిస్తున్నప్పుడు మనం మన వేళ్లను ఉపయోగిస్తాము. దీంతో వేళ్లు, చేతుల్లో నొప్పి వస్తుంది. మొబైల్ వాడకం వల్ల వచ్చే చేతి లేదా కండరాల నొప్పిని ట్రిగ్గర్ ఫింగర్ అంటారు. 

ట్రిగ్గర్ ఫింగర్ సమస్యతో ఎం జరుగుతుంది? : ట్రిగ్గర్ ఫింగర్ సమస్య ఉన్న వ్యక్తుల వేళ్లలో నొప్పి, వాపు అనుభవిస్తారు. వేళ్లు ఉదయం గట్టిగా ఉంటాయి ఇంకా వేళ్ల కదలికల సమయంలో వేళ్ల నుండి శబ్దం కూడా వస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు వేళ్ల కింద అరచేతిలో నొప్పి లేదా గడ్డలను ఎదుర్కొంటారు. నేడు ప్రపంచవ్యాప్తంగా 2 శాతం మంది ప్రజలు ట్రిగ్గర్ ఫింగర్ సమస్యలతో బాధపడుతున్నారు. 

ట్రిగ్గర్ ఫింగర్ సమస్య ఉన్నవారు అకస్మాత్తుగా తమ వేళ్లను వంచుతారు. వేళ్లు కొంత సమయం వరకు వంగి ఉండవచ్చు. ఈ సమస్య ఏదైనా వేళ్లు లేదా బొటనవేళ్లలో చూడవచ్చు. ట్రిగ్గర్ ఫింగర్ సమస్య ఉన్నవారికి ఉదయం తీవ్రమైన నొప్పి ఉంటుంది.

నిత్యం మొబైల్ ఫోన్లు వాడటం వల్ల నరాలు వాచిపోతాయి. మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు మనం పదే పదే వేళ్లను వంచి, నిఠారుగా చేస్తాం. దీంతో వేలి రక్తనాళాలు ఉబ్బుతాయి. ఉబ్బిన రక్తనాళాలు సన్నని కవచం గుండా వెళుతున్నప్పుడు క్లిక్ చేసే శబ్దం వినబడుతుంది. ట్రిగ్గర్ వేలికి ప్రధాన కారణం.

మీ వేళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోండి : ట్రిగ్గర్ ఫింగర్ సమస్యను నివారించడానికి మీ వేళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ట్రిగ్గర్ ఫింగర్ సమస్యతో బాధపడేవారు మీ వేలికి మరింత కంఫర్ట్ ఇస్తూ మొబైల్ వాడకాన్ని తగ్గించి వేళ్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. వేళ్లను సున్నితంగా మసాజ్ చేయండి ఇంకా వారానికి 2-3 సార్లు మీ చేతులను వేడి నీటిలో ఉంచండి. ఇలా చేయడం వల్ల చేతి వేళ్ల నొప్పులు తగ్గుతాయి.

ట్రిగ్గర్ ఫింగర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి కొన్ని సింపుల్ టిప్స్  పాటించవచ్చు. కానీ అతిగా మొబైల్ వాడటం వల్ల వేళ్లలో చాలా నొప్పి వచ్చినప్పుడు లేదా వాపు మొదలైన వాటి వల్ల ట్రిగ్గర్ వేలు లేదా వేళ్ల నొప్పి తగ్గదు. ఇలాంటి  సమయాల్లో మీరు మొదట వైద్యుడిని సంప్రదించాలి. ట్రిగ్గర్ వేలు ద్వారా ప్రభావితమైన కండరాలకు వైద్యుడు శస్త్రచికిత్స ద్వారా చికిత్స చేస్తాడు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.