Dennis Austin, the creator of PowerPoint.. at the age of 76.. celebrities mourned...

 Dennis Austin, the creator of PowerPoint.. at the age of 76.. celebrities mourned...

పవర్‌పాయింట్‌ సృష్టికర్త డెన్నిస్ ఆస్టిన్.. 76 ఏళ్ల వయసులో.. సంతాపం తెలిపిన ప్రముఖులు...

Dennis Austin, the creator of PowerPoint.. at the age of 76.. celebrities mourned...

పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ కో-క్రియేటర్  డెన్నిస్ ఆస్టిన్, కాలిఫోర్నియాలోని లాస్ ఆల్టోస్‌లోని తన ఇంట్లో  సెప్టెంబర్ 1న  తుది శ్వాస విడిచారు. అతని వయసు 76 ఏళ్ళు. డెన్నిస్ ఆస్టిన్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నాట్లు అతని కుమారుడు మైఖేల్ ఆస్టిన్   తెలిపినట్లు ఒక వార్త పత్రిక నివేదించింది.

డెన్నిస్ ఆస్టిన్ MIT అండ్ UC శాంటా బార్బరా  లో ఇంజనీరింగ్ చదివాడు. తరువాత సాఫ్ట్‌వేర్ కంపెనీ ఫోర్‌థాట్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా చేరి పవర్‌పాయింట్‌ను కో-డెవలప్ చేశాడు. 

 మైక్రోసాఫ్ట్ కంపెనీ  కొన్ని నెలల తర్వాత $14 మిలియన్లకు పవర్‌పాయింట్‌ను  కొనుగోలు చేసింది. ఆస్టిన్ 1985 నుండి 1996 వరకు PowerPoint   ముఖ్య డెవలపర్. 1993 నాటికి PowerPoint $100 మిలియన్లకు పైగా సేల్స్ సంపాదించింది. మైక్రోసాఫ్ట్ పవర్‌పాయింట్‌ని వర్డ్‌తో సహా ఆఫీస్ ప్రోగ్రామ్‌ల సూట్‌లో విలీనం చేసింది.

డెన్నిస్ ఆస్టిన్ - రాబర్ట్ గాస్కిన్స్‌తో కలిసి ఈ  సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా డెన్నిస్  ఆస్టిన్ పవర్‌పాయింట్‌ను ఈజీగా ఉపయోగించాడు. అతను డైరెక్ట్-హ్యాండ్లింగ్ ఇంటర్‌ఫేస్ ద్వారా దీనిని సాధించాడని  అందులో రాశాడు. "స్వేటింగ్ బుల్లెట్స్: నోట్స్ ఎబౌట్ ఇన్వెంటింగ్ పవర్‌పాయింట్" పుస్తకంలో రాబర్ట్ గాస్కిన్స్   "డెన్నిస్ ఆస్టిన్  సగం కంటే ఎక్కువగా డిజైన్ ఆలోచనలతో ముందుకు వచ్చాడు" అని పేర్కొన్నాడు. 

  పవర్ పాయింట్‌ని రూపొందించిన వ్యక్తి డెన్నిస్ ఆస్టిన్ కాకపోయి ఉంటే దాని గురించి ఎవరూ విని ఉండే వారు కాదు. పవర్‌పాయింట్‌లో ప్రతిరోజూ 30 మిలియన్లకు పైగా ప్రెసెంటేషన్స్  క్రియేట్ చేయబడుతున్నాయి ఒక నివేదికలో తెలిపింది.

ఈ సాఫ్ట్‌వేర్‌ను కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, బిజినెస్ స్కూల్‌లు, ప్రొఫెసర్లు ఇంకా మిలిటరీ జనరల్‌లు ఉపయోగిస్తున్నారు. డెన్నిస్ ఆస్టిన్ మే 28, 1947న పిట్స్‌బర్గ్‌లో జన్మించాడు. అయితే ఆయన మృతికి పలువురు సంతాపం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.