Big changes coming to WhatsApp video call; know the New features-sak

 Big changes coming to WhatsApp video call; know the New features-sak

వాట్సాప్ వీడియో కాల్‌లో భారీ మార్పులు.. ; కొత్త ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయంటే..?

Big changes coming to WhatsApp video call; know the New features-sak

ఇది స్పామ్ కాల్‌లను కూడా నివారిస్తుంది. వాట్సాప్‌ను తరచుగా అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ సిఫార్సు చేస్తోంది. వాట్సాప్ గ్రూప్ కాల్‌కు ఒకేసారి 15 మందిని జోడించగల ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. 

 ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వీడియో కాల్స్‌లో  ల్యాండ్ స్కేప్ మోడ్ వచ్చేసింది. ఇది వాట్సాప్ కాల్స్ ని మరింత మెరుగుపరచడానికి సహాయపడుతుంది. వీడియో కాలింగ్ అనేది సాధారణంగా యాప్ యూజర్లు ఎక్కువగా ఉపయోగించే ఫీచర్. వాట్సాప్ అఫీషియల్ చేంజ్‌లాగ్‌లో దీనికి సంబంధించి వాట్సాప్ ఒక ప్రకటనను విడుదల చేసింది.

ఇంతకుముందు, సైలెన్స్ అన్‌నోన్ కాలర్స్ ఫీచర్‌ను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇది ఇన్‌కమింగ్ కాల్స్ ను మ్యానేజ్ చేయడానికి యూజర్లకు సహాయపడుతుంది. ముఖ్యంగా తెలియని కలర్స్ నుండి వచ్చిన కాల్స్. సెట్టింగ్‌లు - ప్రైవసీ - కాల్స్  ద్వారా యూజర్లు తెలియని నంబర్‌ల నుండి కాల్స్ ని సైలెంట్ చేయవచ్చు.  

ఇది స్పామ్ కాల్స్ ని కూడా నివారిస్తుంది. వాట్సాప్‌ను తరచుగా అప్‌డేట్ చేసుకోవాలని కంపెనీ సిఫార్సు చేస్తోంది. వాట్సాప్ గ్రూప్ కాల్స్ లో ఒకేసారి 15 మందిని  జోడించగల ఫీచర్‌ను కంపెనీ పరీక్షిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇది ఏడు మందికే పరిమితంగా ఉంది.

చాట్ లాక్ అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తున్న యాప్ ఫీచర్. ఈ ఫీచర్ ప్రకారం యూజర్లు వారి ప్రైవేట్ చాట్‌లు, కాంటాక్ట్‌లు ఇంకా  గ్రూప్‌లను లాక్ చేసుకోవచ్చు. వినియోగదారులు వారి  ప్రైవేట్ చాట్‌లను ఎవరు యాక్సెస్ చేయగలరో పూర్తిగా కంట్రోల్ చేయవచ్చు. WabetInfo నివేదిక ప్రకారం, ఒకసారి చాట్ లాక్ చేయబడితే, యూజర్ మాత్రమే దాన్ని  ఓపెన్ చేయగలరు.  

ఈ లాక్  ఫింగర్ ప్రింట్  లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి సెట్ చేయబడుతుంది. అనుమతి లేకుండా యూజర్ ఫోన్‌ని యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినట్లయితే, యాప్ ముందుగా చాట్‌ను క్లియర్ చేయమని అడుగుతుంది. సింపుల్ గా చెప్పాలంటే దీనిని ఓపెన్ చేయడానికి  ప్రయత్నిస్తున్న వ్యక్తి ముందు స్పష్టమైన విండో తెరవబడుతుంది. లాక్ చాట్ ఫీచర్ లాక్ చేయబడిన చాట్‌లో పంపబడిన ఫోటోలు ఇంకా  వీడియోలు ఫోన్ గ్యాలరీకి ఆటోమేటిక్ గా  డౌన్‌లోడ్ చేయబడకుండా చూసుకుంటుంది.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.