Toll Free Route Google Maps

 Toll Free Route Google Maps 

Toll Free Route Google Maps

సంక్రాంతి ప్రయాణాలు చేస్తున్నారా? హైవేపై రద్దీ, టోల్ ఛార్జీలతో విసిగిపోయారా? టోల్ చెల్లించకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రయాణించాలని అనుకుంటున్నారా? అయితే, మీకు గుడ్న్యూస్! ఈ సింపుల్ టిప్ ఫాలో అయితే చాలు. అదేంటంటే?

సంక్రాంతి పండగ సమయంలో ప్రయాణాలు అంటే ఎలా ఉంటుందో తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సొంతూర్లకు వచ్చీపోయే సమయంలో రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్లు, టోల్ ప్లాజాల వద్ద ఎదురుచూపులు, ఛార్జీల మోత వంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సిందే! అయితే, ట్రాఫిక్ సమస్యల నుంచి బయటపడేందుకు, టోల్ ఛార్జీలు తప్పించుకునేందుకు ఓ మంచి మార్గం ఉంది. దాన్ని పాటిస్తే డబ్బుతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది.

Travel Without Toll Gates : డబ్బు, సమయం సేవ్ చేసుకోవాలంటే మీ వద్ద ఒక్క టూల్ ఉంటే చాలు. కొన్ని సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి మీ రోడ్డు ప్రయాణాన్ని ఇక సాఫీగా మార్చుకోవచ్చు. టోల్ ఛార్జీలు లేని మార్గాలు, రద్దీ లేని రూట్లలో రయ్రయ్ అంటూ దూసుకెళ్లిపోవచ్చు. మరి ఆ టూల్ ఏంటోనని ఆలోచిస్తున్నారా? అదే 'గూగుల్ మ్యాప్స్'.


ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి!

గూగుల్ మ్యాప్స్ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన ఫీచర్లతో రహదారులపై టోల్ప్లాజాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించవచ్చు. ఆ టోల్స్లో ఎంత ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందో కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు, టోల్స్ లేని దారులనూ వెతుక్కోవచ్చు. ఆండ్రాయిడ్తో పాటు ఐఫోన్లోనూ ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కింది స్టెప్స్ ఫాలో అయ్యి టోల్ సమస్యలు లేని రూట్ వెతికేద్దాం పదండి.


గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి మీ జర్నీ స్టార్టింగ్, ఎండ్ పాయింట్లను ఎంటర్ చేయాలి.

టాప్ రైట్ కార్నర్లో ఉన్న 3-డాట్ సింబల్పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత 'ఆప్షన్స్'పై క్లిక్ చేయాలి. అందులో 'అవాయిడ్ టోల్స్', 'అవాయిడ్ మోటర్వేస్' అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిపై క్లిక్ చేసి టాగల్ను ఆన్ చేయాలి.

వెంటనే మీకు టోల్గేట్లు లేని మార్గాలను గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది.

ఈ సెట్టింగ్స్ను మీరు ఒక్కసారి ఆన్ చేసుకుంటే తర్వాతి నుంచి కూడా మీకు టోల్ గేట్లు లేని మార్గాలనే మ్యాప్స్ చూపిస్తుంది. అవసరం లేదంటే మీరు ఈ సెట్టింగ్స్ను ఆఫ్ చేసేసుకోవచ్చు.

ఆ ఒక్కటి మైనస్!

పండగలకు ఇంటికి వెళ్లినవారికే కాకుండా తరచుగా ఈ మార్గాల్లో ప్రయాణించేవారికి సైతం ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే హైవేలను తప్పించుకోవడం సహా మంచి వ్యూ ఉండే మార్గాల్లో వెళ్లడం వల్ల ప్రయాణికులకు కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే, హైవేలను వీడటం వల్ల ప్రయాణ సమయం కాస్త పెరుగుతుంది. డబ్బు సేవ్ చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఇది చక్కటి ఆప్షన్.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.