SALARY HIKE: Modi Sarkar is the only good news.. Massive salary hike? Happy birthday to them!
మోదీ సర్కార్ అదిరే గుడ్ న్యూస్ అందించబోతోందా? కనీస వేతనాలను భారీగా పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి
కార్మికులకు అదిరే శుభవార్త అందబోతోందా? కొత్త ఏడాదిలో తీపికబురు లభించబోతోందా? వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. కార్మికుల జీతాలు భారీగా పెరగొచ్చనే అంచనాలు సర్వత్రా నెలకొన్నాయి. ఎప్పటి నుంచి పెరగొచ్చు? ఎందుకు పైకి కదలొచ్చు? వంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికల ఏడాది కావడంతో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు భారీ గుడ్ న్యూస్ చెప్పొచ్చని మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. దేశ వ్యాప్తంగా ఎన్నికలకు ముందుగానే వీరికి తీపికబురు అందించొచ్చని తెలుస్తోంది.
మోదీ సర్కార్ త్వరలోనే కనీస వేతన పెంపు నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయొచ్చని నివేదికలు పేర్కొంటున్నాయి. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలియజేస్తున్నాయి. ఇదే జరిగితే చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు.
2021లో ఎస్‌పీ ముఖర్జీ సార్థ్యంలో ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ 2024 జూన్ వరకు కొనసాగుతుంది. ఈ కమిటీ అతిత్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి తన నివేదికను సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే కొత్త వేతన పెంపు నిర్ణయాన్ని కూడా ఎన్నికలకు ముందుగానే ప్రభుత్వం నోటిఫై చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ నుంచి మే మధ్యలో జరిగే అవకాశం ఉంది.
కమిటీ నివేదిక చాలా వరకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. చిట్ట చివరిగా ఒక సమావేశం తర్వాత కమిటీ దానిని త్వరలో ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే అతిత్వరలోనే కమిటీ తన నివేదికను మోదీ సర్కార్‌కు అందజేయనుంది.
దేశంలో దాదాపు 50 కోట్ల మంది కార్మికులు ఉన్నారు. వీరిలో 90 శాతం మంది అసంఘటిత రంగంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. దేశంలో ఫోర్ల వేజ్ (కనీస వేతనం) ప్రస్తుతం రోజుకు రూ.176 ఉంది. దీన్ని చివరిగా 2017లో సవరించారు.
జీవన వ్యయం పైకి చేరడం, ద్రవ్యోల్బణం పెరుగుదల వంటి అంశాల కారణంగా కనీస వేతన పెంపు అనివార్యం అయ్యిందని చెప్పుకోవచ్చు. కోడ్ ఆన్ వేజెస్ 2019 ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి కనీస వేతన సవరణకు అధికారం ఉంటుంది. అన్ని రాష్ట్రాలకు ఈ పెంపు వర్తిస్తుంది. కార్మికుల కనీస జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని సవరణ ఉండొచ్చు.
అనూప్ సత్పతి నేతృత్వంలోని ఒక కమిటీ 2019లోనే కనీస వేతనాన్ని రోజుకు రూ.375కు పెంచాలని ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వంతో సహా యజమానులకు ఆర్థికపరమైన సమస్యల కారణంగా గవర్నమెంట్ దానిని అంగీకరించలేదు. ఎందుకంటే ఈ ప్రతిపాదిత కనీస వేతన రేటు.. ప్రస్తుత రేటుకు 100 శాతం కన్నా ఎక్కువగా ఉంది.
అనూప్ కమిటీ సిఫార్సు రేటు రూ.375, ప్రస్తుతం కనీస వేతన రేటుకు సమతుల్యత ఉండాలని యజమానుల సంఘం ప్రతినిధి ఒకరు తెలియజేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ద్రవ్యోల్బణం, గృహ ఖర్చులు పరిగణనలోకి తీసుకొని కమిటీ కనీస వేతనాన్ని నిర్ణయించే అవకాశం ఉంది.
కోడ్ ఆన్ వేజెస్ 2019 ప్రకారం చూస్తే.. కేంద్ర ప్రభుత్వం వివిధ భౌగోళిక ప్రాంతాలకు వేర్వేరు కనీస వేతన రేటును నిర్ణయించవచ్చు. అయితే ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతన రేటును తగ్గించడానికి అనుమతించదు.
ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు రోజువారీ వేతనం రేటును రూ.176 కంటే తక్కువగా నిర్ణయించాయి. మరికొన్ని వాటి కంటే ఎక్కువ ఫ్లోర్ రేటును కలిగి ఉన్నాయి. రాష్ట్రాల మధ్య కనీస వేతనాలలో ఈ వ్యత్యాసం దేశంలోని కార్మికుల వలసలపై ప్రభావం చూపుతుంది.