LIC Policy: How much money will be refunded on cancellation of LIC policy, what documents are required?
LIC Policy Surrender Value: There are many avenues available in the market for investments and LIC Policy is one of them. Most people in India consider and prefer investing through Life Insurance Corporation of India (LIC) policies as the safest way.
LIC Policy: ఎల్‌ఐసీ పాలసీని రద్దు చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది, ఏయే పత్రాలు అవసరం?
LIC Policy Surrender Value: పెట్టుబడుల కోసం మార్కెట్లో అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి, వాటిలో ఎల్ఐసీ పాలసీ ఒకటి. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) పాలసీల ద్వారా పెట్టుబడి పెట్టడాన్ని అత్యంత సురక్షిత మార్గంగా భారతదేశంలో ఎక్కువ మంది భావిస్తారు, వాటికి ప్రాధాన్యత ఇస్తారు.
అందుకే మన దేశంలో కొన్ని కోట్ల మంది కనీసం రెండు కంటే ఎక్కువ పాలసీలు తీసుకుంటున్నారు. పేదలు కూడా కనీసం ఒక పాలసీ అయినా కడుతున్నారు. దీనికి ప్రధాన కారణం.. పెట్టుబడితో పాటు జీవిత బీమా సౌకర్యాన్ని కూడా పొందడం. ఒకవేళ పాలసీదారు మరణిస్తే, ఈ పాలసీ బాధిత కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతుంది.
కొనసాగుతున్న పాలసీకి ఇకపై డబ్బులు కట్టలేని పరిస్థితిలో పాలసీదారు ఉన్నా, లేదా అకస్మాత్తుగా డబ్బు అవసరమైనా, పాలసీ కోసం కట్టిన డబ్బును తిరిగి వెనక్కు తీసుకోవచ్చు. అంటే, డబ్బు అవసరాలను తీర్చుకోవడానికి ఆ పాలసీని సరెండర్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నియమాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
3 సంవత్సరాల తర్వాతే సరెండర్ చేయాలి
మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని మీరు భావిస్తే, ఎల్ఐసీకి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని 'పాలసీని సరెండర్ చేయడం' అంటారు. అయితే, ప్రతి పాలసీకి మూడు సంవత్సరాల లాక్-ఇన్ పిరియడ్ ఉంటుంది. అంటే, మీరు ఒక పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల లోపు సరెండర్ చేయడానికి పాలసీ రూల్స్ ఒప్పుకోవు. మూడు తర్వాత మాత్రమే మీ పాలసీని సరెండర్ చేయడానికి వీలవుతుంది. 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే, అప్పటి వరకు మీరు చెల్లించిన మొత్తంలో కొంత భాగాన్ని తిరిగి పొందుతారు. దీనినే సరెండర్ విలువగా పిలుస్తారు.
ఎంత డబ్బు తిరిగి వస్తుంది?
మెచ్యూరిటీ తేదీకి ముందే ఎల్ఐసీ పాలసీని సరెండర్ చేయడం వల్ల ఖాతాదార్లకు చాలా నష్టం జరుగుంది, సరెండర్ విలువ భారీగా తగ్గుతుంది. మీ పాలసీ రెగ్యులర్ అయితే, 3 సంవత్సరాల పాటు చెల్లించిన ప్రీమియంల ఆధారంగా సరెండర్ విలువను లెక్కిస్తారు. పాలసీని ప్రారంభించిన తేదీ నుంచి 3 సంవత్సరాల లోపు ఆ పాలసీని సరెండర్ చేస్తే, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదు. అందుకే, పాలసీ తేదీ నుంచి తొలి మూడేళ్ల కాలాన్ని లాక్-ఇన్ పిరియడ్ అని చెప్పింది.
మీరు 3 సంవత్సరాలు లేదా అంతకుమించి మీ ఎల్ఐసీ పాలసీకి ప్రీమియం చెల్లించినట్లయితే, సరెండర్ విలువ పొందడానికి మీరు అర్హులు అవుతారు. అయితే, మీరు చెల్లించిన ప్రీమియంలో 30% మాత్రమే తిరిగి పొందుతారు. మొదటి సంవత్సరంలో మీరు చెల్లించిన ప్రీమియంను సున్నాగా పరిగణిస్తారు.
పాలసీని సరెండర్ చేయడానికి అవసరమైన పత్రాలు
LIC పాలసీ ఒరిజినల్ బాండ్ డాక్యుమెంట్, సరెండర్ వాల్యూ చెల్లింపు కోసం అభ్యర్థన పత్రం, ఎల్ఐసీ సరెండర్ ఫారం 5074, ఎల్ఐసీ నెఫ్ట్ ఫారం, మీ బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఒరిజినల్ ID రుజువు, క్యాన్సిల్ చేసిన బ్యాంక్ చెక్, LIC పాలసీని ముందుస్తుగానే మూసివేయడంపై రాతపూర్వక వినతి పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది.