Are you preparing for 10 exams.. Hindi subject tips are for you..

Are you preparing for 10 exams.. Hindi subject tips are for you..

పది పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా.. హిందీ సబ్జెక్ట్ టిప్స్ మీకోసమే..

Are you preparing for 10 exams.. Hindi subject tips are for you..

మార్చిలో పది పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పాఠశాలలలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించి పదవ తరగతి విద్యార్థులకు మెలకువలను సైతం నేర్పిస్తున్నారు.

మార్చిలో పది పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే అన్ని పాఠశాలలలో ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించి పదవ తరగతి విద్యార్థులకు మెలకువలను సైతం నేర్పిస్తున్నారు. పది పరీక్షలలో రాణించాలంటే సబ్జెక్టుపై పట్టు సాధించడంతో పాటు, మానసిక స్థైర్యాన్ని సైతం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దిశా నిర్దేశం చేస్తున్నారు.

ఇలా పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ప్రత్యేకమైన అభ్యసనం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చని, హిందీ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించే అవకాశం ఉంటుందని ప్రకాశం జిల్లా ఒంగోలులోని బండ్లమెట్ట ప్రభుత్వ బాలికల పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు సయ్యద్ మస్తాన్ బి , లోకల్ 18 ద్వారా తెలిపారు.

ఒంగోలులోని బండ్లమిట్టలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలు సయ్యద్ మస్తాన్ బి మాట్లాడుతూ… ప్రస్తుతం హిందీ ప్రశ్నాపత్రంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని, వీటిని ప్రతి విద్యార్థి గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తీర్ణత మార్కులు 20 మార్కులే కాబట్టి హిందీ సబ్జెక్టులో రాణించలేని విద్యార్థులు సైతం తగిన అభ్యసనం ద్వారా ఫలితాలను సాధించవచ్చని ఆమె సూచించారు.

పద్యభాగంలోని తొలి మూడు పాఠాలలో కవి పరిచయాలను, సారాంశాలను ప్రత్యేకంగా సాధన చేయాలని అలా చేసిన ఎడల వెనుకబడిన విద్యార్థులు విజయాన్ని అందుకునే అవకాశం ఉందన్నారు. అయితే హిందీ సబ్జెక్టు పరీక్షలో 100కు 100 మార్కులు సాధించే అవకాశం ఉంటుందని, అందుకు తగిన సాధన చేయాల్సిన అవసరం ఉందన్నారు.

హిందీలోని పద్యభాగం, గద్యభాగం కవులపై పట్టు కలిగి ఉండి, కొంచెం వ్యాకరణం సాధన, పాఠాన్ని అర్థం చేసుకొని వ్యాసం రూపంలో రాసిన యెడల మంచి మార్కులు సాధించవచ్చన్నారు. ప్రధానంగా హిందీ సబ్జెక్టు పై భయం కలిగిన విద్యార్థులు అటువంటి భయాన్ని పోగొట్టుకొని సక్రమంగా సాధన చేస్తే ఉత్తీర్ణత మార్కులు సాధించవచ్చన్నారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి హిందీ సబ్జెక్ట్ లో మంచి మార్కులు సాధించాలని సయ్యద్ మస్తాన్ బి ఆకాంక్షించారు.

Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.