Amitabh bought a place in Ayodhya.. The rates are more than Mumbai.. Mind blank if you know the price..
అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్.. ముంబైను మించిన రేట్లు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్..
అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్.. ముంబైను మించిన రేట్లు.. ధర తెలిస్తే మైండ్ బ్లాంక్..
Amitabh Bachchan Buy land In Ayodhya : అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అమితాబ్ బచ్చన్ కొన్న ఈ ప్లాట్ 7 స్టార్ మల్టీ పర్పస్ ఎన్‌క్లేవ్ - ది సరయులో ఉంది. అయితే దీని ధరను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.
అమితాబ్ బచ్చన్ అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయి. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో దేశంలోని ప్రముఖులు పాల్గొననున్నారు. క్రీడా, రాజకీయ, సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొంటారు.
ఈ వేడుకకు సంబంధించిన అతిథి జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. వీటన్నింటి మధ్య, బిగ్ బి అయోధ్యలో ఒక ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ముంబైకి చెందిన డెవలపర్ కంపెనీ ‘ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ అనే సంస్థ ద్వారా ఆయన ఈ ప్లాట్‌ను కొనుగోలు చేశాడు.
అమితాబ్ బచ్చన్ కొన్న ఈ ప్లాట్ 7 స్టార్ మల్టీ పర్పస్ ఎన్‌క్లేవ్ - ది సరయులో ఉంది. అయితే దీని ధరను చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్లాట్ ధర రూ. 14.5 కోట్లుగా ఉంది. విస్తీర్ణం 10 వేల చదరపు అడుగులుగా ఉందట.
ఇక అమితాబ్ బచ్చన్ ఉత్తర ప్రదేశ్‌లోను జన్మించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆయన జన్మస్థలం అయోధ్యకు చాలా దగ్గరోనే ఉంటుంది. బిగ్ బి ప్రయాగ్‌రాజ్ నివాసి. ప్రయాగ్‌రాజ్ నుండి అయోధ్యకు దూరం 5 గంటల కంటే తక్కువ.
ఇక అమితాబ్ బచ్చన్ ప్లాట్‌ను అయోద్యలో కొనుగోలు చేయడం ఒక మైలురాయిగా డెవలపర్ కంపెనీ తెలిపింది. కంపెనీ ప్రెసిడెంట్ అభినందన్ లోధా మాట్లాడుతూ.. సరయు మొదటి కస్టమర్‌గా బిగ్ బిని స్వాగతిస్తున్నానని తెలిపారు.
అమితాబ్ బచ్చన్ ప్లాట్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల దూరంలో ఉంది. సరయూ ఎన్‌క్లేవ్ రామాలయానికి 15 నిమిషాల దూరంలో, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల దూరంలో ఉందని అభినందన్ లోధా చెప్పారు.
అమితాబ్ బచ్చన్ ప్లాట్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల దూరంలో ఉంది. సరయూ ఎన్‌క్లేవ్ రామాలయానికి 15 నిమిషాల దూరంలో, అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి 30 నిమిషాల దూరంలో ఉందని అభినందన్ లోధా చెప్పారు.
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తెలుగు నుంచి చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ దంపతులు ఉన్నారు. ఇక వీరితోపాటు అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్ దంపతులు, టైగర్ ష్రాఫ్, జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా, ఆయుష్మాన్ ఖురానా, రజనీకాంత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, సన్నీ డియోల్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, మోహన్‌లాల్, రిషబ్ శెట్టి, కంగనా రనౌత్, మధుర్ భండార్కర్ ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు.