Upcoming Phones
డిసెంబర్‌లో మార్కెట్లోకి రానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ధర, ఫీచర్లు చెక్ చేయండి..
కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఫోన్లు కాకుండా, లేటెస్ట్ మోడళ్లు కొనాలని చూస్తున్నారా? మీకు ఒక గుడ్‌న్యూస్. ప్రస్తుత డిసెంబర్ నెలలో కొన్ని టెక్ కంపెనీలు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనున్నాయి. వన్‌ప్లస్, షియోమి, రియల్‌మీ, ఇతర బ్రాండ్ల నుంచి రానున్న మోడళ్లపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ లిస్టులో బడ్జెట్, మిడ్‌రేంజ్ ఫోన్లు ఉన్నాయి. డిసెంబర్‌లో మార్కెట్లోకి రిలీజ్ కానున్న స్మార్ట్‌ఫోన్లు ఏవో చూడండి.
* వన్‌ప్లస్ 12 5G
వన్‌ప్లస్ బ్రాండ్ డిసెంబర్ 5న చైనాలో వన్‌ప్లస్ 12 (OnePlus 12) ఫోన్‌ను లాంచ్ చేయనుంది. గ్లోబల్ లాంచ్ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ మార్కెట్లలో దీని ప్రమోషన్‌ను వన్‌ప్లస్ ప్రారంభించింది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ డిసెంబర్ చివర్లో లేదా జనవరిలో భారత్‌లో రిలీజ్ కావచ్చు. , వన్‌ప్లస్ 12 సిరీస్‌ను కంపెనీ జనవరిలో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరిస్తుందని టిప్‌స్టర్ మాక్స్ జాంబోర్ పేర్కొన్నారు. వన్‌ప్లస్ 11 5G ధర బేస్ వేరియంట్ ఇండియాలో రూ.54,495 వరకు ఉంది. కొత్త ఫోన్ ధర కూడా ఇదే రేంజ్‌లో ఉండవచ్చు.
* రెడ్‌మీ 13C 5G
రెడ్‌మీ 13C 5G ఫోన్ బడ్జెట్ రేంజ్‌లో సరికొత్త ఫీచర్లతో రిలీజ్ కానుంది. దీని ధర రూ.10వేల రేంజ్‌లో ఉండవచ్చు. ఈ ఏడాది మార్చిలో లాంచ్ అయిన రెడ్‌మీ 12Cకి సక్సెసర్‌గా కొత్త మోడల్‌ను కంపెనీ తీసుకొస్తోంది. Redmi 13C ఇప్పటికే నైజీరియాలో లాంచ్ అయింది. డిసెంబర్ 6న ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది కంపెనీ ‘C’ సిరీస్‌లో తీసుకొచ్చిన ఫస్ట్ 5G స్మార్ట్‌ఫోన్‌గా నిలుస్తోంది. రెడ్‌మీ 13C 5G ఇప్పటికే అమెజాన్‌లో లిస్ట్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 50 MP ప్రైమరీ కెమెరాతో, స్టార్‌డస్ట్ బ్లాక్, స్టార్ షైన్ గ్రీన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
* రెడ్‌మీ నోట్ 13 ప్రో సిరీస్
భారతదేశంలో రెడ్‌మీ నోట్ 13 ప్రో సిరీస్ ఫోన్లు ఈ డిసెంబర్ లేదా జనవరిలో లాంచ్ అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 13, రెడ్‌మీ నోట్ 13 ప్రో, రెడ్‌మీ నోట్ 13 ప్రో ప్లస్ 5G మోడళ్లు రిలీజ్ అవుతాయి. ఇప్పటికే చైనాలో రిలీజ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్లు, ఇండియాలో మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టాయి. వీటి ధరలు రూ.30వేల నుంచి ప్రారంభం కావచ్చని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి.
* రియల్‌మీ GT5 ప్రో
రియల్‌మీ GT5 ప్రో (Realme GT5 Pro) ఫోన్ డిసెంబర్ 7న చైనాలో లాంచ్ కానుంది. అడ్వాన్స్‌డ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌తో ఈ ఫోన్ రానుంది. వైర్‌లెస్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ వంటి ఫీచర్లతో ఫోన్‌ను రూపొందించారు. భారత్‌లో ఈ ఫోన్ లాంచ్ డేట్‌ను ఇంకా వెల్లడించలేదు. త్వరలో గ్లోబల్ మార్కెట్లలో రిలీజ్ కానున్న ఈ డివైజ్ ధర రూ.50వేల నుంచి రూ.60వేల వరకు ఉండవచ్చు.
