CAR
మీరు డ్రైవింగ్‌లో ఈ తప్పులు పదే పదే చేస్తున్నారా..? అయితే, మీ కారు షెడ్డుకు వెళ్లడం ఖాయం!
మీకు కారు (Car) ఉందా… అది ఎక్కువ కాలం ఎలాంటి ట్రబుల్స్ లేకుండా మీ ప్రయాణానికి సౌకర్యవంతంగా ఉండాలనుకుంటున్నారా… అయితే కారును ఎప్పటికప్పుడు సరిగా మెయిటనెన్స్ చేయడంతో పాటు కొన్ని డ్రైవింగ్ అలవాట్లును నివారించాల్సి ఉంటుంది. దీంతో అది సుదీర్ఘ కాలం మీకు మన్నికగా వస్తుంది. ఆ డ్రైవింగ్ హ్యాబిట్స్ ఏంటో చూద్దామా…
కోల్డ్ ఇంజన్ పునరుద్ధరించడం
సాధారణంగా కారు ఇంజన్ చల్లగా ఉన్నప్పుడు, ఆయిల్ సరిగ్గా సర్క్యులేట్ అవ్వదు. ఈ సమయంలో ఇంజన్ స్టార్ చేసి కారును డ్రైవ్ చేయడం వల్ల అందులోని పార్ట్స్ ప్రధానంగా బేరింగ్స్, పిస్టన్స్‌పై ఒత్తిడి ఏర్పడి విపరీతంగా అరిగిపోయే అవకాశం ఉంది. ఇది భవిష్యత్‌లో ఇంజన్ ట్రబుల్‌కు దారితీసి ఆర్థికంగా మీకు నష్టం కలిగించవచ్చు. దీన్ని నివారించాలంటే డ్రైవింగ్ చేయడానికి ముందు కారు ఇంజిన్‌ను స్టార్ చేసిన తరువాత ఒక నిమిషం పాటు వదిలేయాలి. దీంతో ఇంజన్ కొద్దిగా వేడెక్కుతుంది. అప్పుడు డ్రైవింగ్ ప్రారంభిస్తే కారు ఎక్కువ కాలం మన్నికగా వస్తుంది.
సరిగా మెయిన్‌టనెన్స్ చేయపోవడం
కారు యజమాని తప్పనిసరిగా కంపెనీ పేర్కొన్న నిర్వహణ(సర్వీస్) షెడ్యూల్‌ను తూచా తప్పకుండా అనుసరించాలి. రెగ్యులర్ సర్వీసింగ్‌లో సాధారణంగా కంపెనీ సిబ్బంది ఆయిల్ ఛేంజింగ్‌తో పాటు అవసరమైన ఇతర మార్పులు చేస్తుంటారు. ఈ సర్వీస్ ద్వారా పెద్ద సమస్యలకు దారితీసే సమస్యలను గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం వల్ల కారు త్వరగా వేడెక్కుతుంది. దీంతో కారు సిస్టమ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంధన ట్యాంక్ వ్యవస్థలోకి ఇంధనాన్ని లాగడానికి కారు చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే కారులో ఎల్లప్పుడు తగినంతగా ఇంధనం ఉండేట్లు చూసుకోవడం మంచిది.
గేర్ షిఫ్టర్‌పై చెయ్యి ఉంచడం
ప్రమాదకరం కాదని అనిపించినప్పటికీ, గేర్ షిఫ్టర్‌పై చేతిని ఉంచడం వల్ల ట్రాన్స్‌మిషన్‌పై అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా అది రాబోయే రోజుల్లో దెబ్బతినవచ్చు. స్థిరమైన కదలిక షిఫ్టర్స్ ట్యూనింగ్ మారవచ్చు. క్రమంగా అది ట్రాన్స్‌మిషన్ భాగాలకు విస్తరించి మీకు ఆర్థికంగా నష్టాన్ని తీసుకురావచ్చు. అందుకే డ్రైవ్ చేస్తున్నప్పుడు గేర్ మార్చిన వెంటనే స్టీరింగ్ పట్టుకోవడం బెటర్.
క్లచ్‌పై పాదాన్ని ఉంచడం
గేర్ షిఫ్టర్‌పై చేతిని ఉంచడం లాగానే, గేర్‌లను మార్చని సందర్భాల్లో కూడా పాదాలను క్లచ్‌పై ఉంచడం వల్ల, క్లచ్, ట్రాన్స్‌మిషన్ అరిగిపోవచ్చు. కాలితో స్థిరమైన ఒత్తిడి కలిగించడం వల్ల క్లచ్ పాక్షికంగా ప్రభావితం అవుతుంది. ఇది ప్రారంభ నష్టానికి దారితీస్తుంది. దాని సామర్థ్యం రాబోయే రోజుల్లో తగ్గుతుంది.
మితిమీరిన బ్రేకింగ్
బ్రేక్‌లను తరచుగా తొక్కడం లేదా వాటిని అనవసరంగా ఉపయోగించడం, కారు జీవితాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ప్రధానంగా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో కారును చాలా నిధానంగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. కారును ఆపడానికి పదేపదే బ్రేకులు ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. దీంతో బ్రేక్ డ్యామేజ్ అవుతుంది. దీన్ని నివారించాలంటే కారును ఆపి ట్రాఫిక్ తగ్గిన తరువాత వెళ్లడం ఉత్తమం. అయితే సడర్ బ్రేక్ వేయకుండా ఒకే వేగంతో నడపడం వల్ల కారుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా చేయాలంటే డ్రైవర్‌కు అద్భుతమైన డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి.
లోతైన నీటిలో డ్రైవింగ్
లోతైన నీటిలో డ్రైవింగ్ చేయడం వల్ల కారు ఎలక్ట్రికల్ సిస్టమ్, ఇంజన్, ట్రాన్స్‌మిషన్ దెబ్బతినే అవకాశం ఉంది. నీటిలో కారు వెళ్లినప్పుడు విద్యుత్ భాగాలను పాడైపోతాయి. ఫలితంగా ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ట్రబుల్ ఇవ్వవచ్చు. ఇది ఖరీదైన మరమ్మతులకు దారితీస్తుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
