Dry Fruits Benefits at Winter

 Dry Fruits Benefits at Winter

చలి కాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఇవే!

Dry Fruits Benefits at Winter
అన్ని కాలాలు వేరు.. చలి కాలం వేరు. ఈ శీతా కాలంలో ప్రత్యేకంగా ఆరోగ్య పరంగా, ఆహార పరంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీంతో మితమైన ఆహారం తీసుకోవాలి. అదే విధంగా చర్మంలో మార్పులు వస్తాయి. చలికి స్కిన్ పొడి బారడం, గీతలు పడటం, డల్ గా మారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వింటర్ సీజన్ లో ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. ఇలా సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే..

అన్ని కాలాలు వేరు.. చలి కాలం వేరు. ఈ శీతా కాలంలో ప్రత్యేకంగా ఆరోగ్య పరంగా, ఆహార పరంగా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశాలు ఉంటాయి. దీంతో మితమైన ఆహారం తీసుకోవాలి. అదే విధంగా చర్మంలో మార్పులు వస్తాయి. చలికి స్కిన్ పొడి బారడం, గీతలు పడటం, డల్ గా మారడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వింటర్ సీజన్ లో ప్రత్యేకమైన కేర్ తీసుకోవాలి. ఇలా సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం:
బాదంలో ప్రోటీన్ అనేది అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. వీటిని చలి కాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.

ఖర్జూరం:
చలి కాలంలో ఖర్జూరం విరివిగా లభిస్తుంది. వీటిల్లో సహజమైన స్వీట్ నెర్ ఉంటుంది. అలాగే ఇది తిన్న వెంటనే రోగ నిరోధక శక్తితో పాటు, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. డేట్స్ ని స్నాక్స్ లా కూడా తీసుకోవచ్చు. అంతే కాకుండా స్మూతీస్, డిజర్ట్ వంటి వాటిల్లో కూడా ఉపయోగించవచ్చు.

ఎండు ద్రాక్ష:
శీతా కాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల ఇమ్యునిటీ బాగా అందుతుంది. ఎందు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చలి కాలంలో వీటిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి.

డ్రై ఆప్రికాట్స్:
ఎండిన ఆప్రికాట్స్ లో విటమిన్ ఎ, పొటాషియం, డైటరీ ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్ లా, సలాడ్స్ వంటి వాటిల్లో ఉపయోగించు కోవచ్చు.

వాల్ నట్స్:
వాల్ నట్స్ లో కూడా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్, మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చలి కాలంలో వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యునిటీతో పాటు చర్మం కూడా అందంగా మారుతుంది.
Share on Google Plus

About Tefza Demo

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.