Sim Card: Do you know how many SIM cards are there on your Aadhaar number? If not needed easily leave it as is.
SIM Cards: Central government has brought Aadhaar card to every Indian to have an identity card.
Aadhaar card is the main one now. Without it, there is no work in the government offices or in the education sector. All your details will be known by entering a single Aadhaar number. As much as the need for Aadhaar has increased, misuse has also increased. Many frauds are done by creating fake Aadhaar cards. Like this
Sim Card: మీ ఆధార్ నెంబర్ పై ఎన్ని సిమ్ కార్డులున్నాయో తెలుసా? అవసరం లేకుంటే సులభంగా ఇలా వదిలేయండి.
SIM Cards: భారతీయులైన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు కార్డుండాలని కేంద్రప్రభుత్వం ఆధార్ కార్డు తీసుకొచ్చింది.
ప్రస్తుతం ఆధార్ కార్డే అన్నింటికి ప్రధానం. అది లేనిదే ప్రభుత్వ కార్యాలయాల్లోనైనా, విద్యా రంగంలోనైనా ఏ పని కాదు. ఒక్క ఆధార్ నంబర్ కొడితే మీ వివరాలన్నీ తెలిసిపోతాయి. ఆధార్ అవసరం ఎంత పెరిగిందో.. దుర్వినియోగం కూడా అంతే పెరిగింది. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించి ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్నో చర్యలు చేపడుతున్నారు.
ఆధార్ నంబర్ ఉంటేనే సిమ్ ను ఇస్తాయి టెలికాం సంస్థలు. కానీ మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డులపై సిమ్ కార్డులను తీసుకుని పలు రకాల నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఆధార్‌తో లింకైన సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని టెలికాం శాఖ ఇటీవల టూల్ అనలటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ (TAFCOP)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆన్‌లైన్ టూల్, పోర్టల్‌తో యూజర్లు ఆధార్ నెంబర్‌తో లింకైన మొబైల్ నెంబర్లను అన్నింటిని తెలుసుకునే వెసులుబాటు ఉంది.
ఈ వెబ్‌సైట్ తో మీ ఆధార్ కార్డు పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుకోవచ్చు. ఇక మీకు తెలియకుండా మీ ఆధార్ నెంబర్‌తో ఏదైనా ఫోన్ నెంబర్ లింకైనట్లు తేలినట్లయితే మీరు ఫిర్యాదు చేయవచ్చు. ఈ వెబ్‌సైట్ ద్వారా మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. దీని వల్ల మీరు మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు. మీరు https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ (OTP)ని ఎంటర్ చేస్తే మీ పేరుపై ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి. వాటిని బ్లాక్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది.