Parents: పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలాంటివి చేస్తున్నారా.? అయితే ప్రమాదమే.. జాగ్రత్త

 Parents: Do parents do this in front of children? But it is dangerous.. Be careful

Parents: Do parents do this in front of children? But it is dangerous.. Be careful

Usually in everyone's house we see parents fighting in front of their children. Small conflicts can become big. Many husband and wife beat their children.

Psychology experts say that it is not good to engage in such confrontations in front of children. Due to this, children are also likely to follow. Let's find out what parents should not do in front of their children.

Parents: పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలాంటివి చేస్తున్నారా.? అయితే ప్రమాదమే.. జాగ్రత్త

సాధారణంగా అందరి ఇళ్లలో పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవలు పడుతుండటం చూస్తూనే ఉంటాము. చిన్నపాటి కలహాలే పెద్దగా మారుతుంటాయి. చాలా మంది భార్యాభర్తలు తమ పిల్లల ముందే కొట్టుకుంటారు.

ఇలాంటి ఘర్షణలకు దిగడం పిల్లల ముందు చేయడం ఏ మాత్రం మంచిది కాదని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పిల్లలు కూడా అనుసరించే అవకాశాలున్నాయంటున్నారు. మరి పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడనివి ఏమిటో తెలుసుకుందాం.

అసభ్య ప్రవర్తన: పిల్లల ముందే భార్య భర్తలు అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. వారి ముందే ఒకరికొకరు పట్టుకోవడం, కిస్సింగ్‌ చేయడం ఇతర పనులు చేయడం వల్ల పిల్లలు నేర్చుకున్నవారువతారు. దీని వల్ల మీ విలువ తగ్గుతుంది. పిల్లలు కూడా అలాంటి పనులు మైండ్‌లో పెట్టుకుంటారు. మీలాగే పిల్లలు కూడా తయారయ్యే ప్రమాదం ఉంది.

అబద్ధం చెప్పడం: చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ముందు అబద్దాలు ఆడుతుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. అయితే కొన్ని విషయాలలో పిల్లలను అబ్దదాలు చెప్పాలని సూచిస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం. పిల్లలు ఒక్కసారి అబద్దాలు చెప్పడం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో కూడా చాలా అబద్దాలు ఆడే ప్రమాదం ఉంది. దీని వల్ల తల్లిదండ్రులు తర్వాత ఇబ్బందులు పడే అవకాశాలుంటాయి.

పిల్లల ముందు అవమానించ రాదు: భార్యా భర్తలు గొడవలు పడిన సందర్భాలలో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకొంటుంటారు. వారి ముందే భర్త భార్యను అవమానించడం, లేదా భార్య భర్తను అవమానించడం చేస్తుంటారు. ఇలా ఒకరికొకరు అవమానించుకోవడం వల్ల పిల్లలు కూడా నేర్చుకునే అవకాశాలుంటాయి. అందుకే పిల్లలున్న సమయంలో భార్యభర్తలు గొడవలు పడితే ఎవరో ఒకరు తగ్గాలి. ఒకరికొకరు గౌరవించుకోవాలి. ప్రేమగా ఉండాలి.

బూతులు మాట్లాడకూడదు: కొంత మంది తల్లిదండ్రులు ఘర్షణకు దిగినప్పుడు పిల్లల ముందే బూతులు మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు కూడా నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలు పెద్దవాళ్ల మాటలనే ఎక్కువగా అనుసరిస్తుంటారు. ఇలా మాటలు మాట్లాడటం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

క్రమశిక్షణా రాహిత్యం: ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ముందు క్రమశిక్షణ రాహిత్యంతో అస్సలు ప్రవర్తించకూడదు. పిల్లలకు మొదటి గురువులు తల్లిదండ్రులు. అందుకే ఇలా చేసినట్లయితే పిల్లలు కూడా వారిలాగానే అనుసరించే అవకాశాలున్నాయి.

పిల్లల ముందు ప్రేమగా ఉండాలి: పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రేమగా ఉండాలి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం లాంటివి చేయకూడదు. వారి ముందు ఎంత ప్రేమగా ఉంటే అంత మంచిది. వాళ్లు కూడా మీపై ప్రేమ కురిపిస్తారు. మీరు చెప్పినట్లు వింటారు. మీపై గౌరవం పెరుగుతుంది. సమాజం పట్ల కూడా గౌరవం పెరిగి అందరితో ప్రేమగా ఉంటారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.