India's first spy: He is more than James Bond.. Spying for five countries while staying in our country... This is the successful 'Silver' story!
When we hear the word spy, the research and analysis wing comes to mind. James Bond is also remembered.
indias first spy: అతను జేమ్స్‌బాండ్‌ను మించినోడు.. మన దేశంలో ఉంటూ ఐదు దేశాలకు గూఢచర్యం... సక్సెస్‌ఫుల్ 'సిల్వర్' స్టోరీ ఇదే!
గూఢచారి(spy) అనే మాట వినిపించగానే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ మనకు గుర్తుకు వస్తుంది. అలాగే జేమ్స్ బాండ్(James Bond) కూడా గుర్తుకువస్తాడు.
దేశంలోని గూఢచారులంతా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(RAW) సంస్థతో అనుసంధానమై ఉంటారు. సీబీఐ, ఐబీ వంటి సంస్థలు దేశంలోని అరాచక శక్తుల(forces of anarchy)పై ఏ విధంగా ఓ కన్నేసి ఉంచి, చర్యలు చేపడతాయో RAW అనేది దేశం వెలుపలి శత్రువుల నుండి దేశాన్ని రక్షించే సంస్థగా పేరుగాంచింది.
ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ దేశానికి ఎంతోమంది తెలివైన గూఢచారులను అందించింది. వీటిలో రవీంద్ర కౌశిక్(Rabindra Kaushik), ఆర్. ఎన్. కావ్, సెహ్మత్ ఖాన్, అజిత్ దోవల్ వంటి పేర్లు అగ్రస్థానంలో ఉన్నాయి.
అయితే రా స్థాపించని 1968 కాలానికి ముందు కూడా ఓ భారతీయ గూఢచారి(Indian spy) ఉండేవాడు. నాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిఘా సంస్థల(surveillance agencies) కార్యాలయాల్లో ఇతని పేరు మారుమోగింది.
అతనెవరో అతను సాధించిన విజయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సిల్వర్(Silver) పేరుతో ప్రపంచం మొత్తానికి పరిచయం అయిన ఆ డిటెక్టివ్ పూర్తి పేరు భగత్ రామ్ తల్వార్(Bhagat Ram Talwar) అలియాస్ 'సిల్వర్'.
భగత్ రామ్ తల్వార్‌ను భారతదేశపు(India) మొదటి డిటెక్టివ్ అని కూడా పిలుస్తారు. ఈ గూఢచారి పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది.
ఎందుకంటే అతను భారతదేశం కోసం మాత్రమే కాకుండా 5 దేశాల కోసం గూఢచర్యం సాగించాడు. రెండవ ప్రపంచ యుద్ధం(Second World War) సమయంలో సిల్వర్ భారతదేశంతో సహా అనేక దేశాల కోసం గూఢచర్యం చేశాడు. భగత్ రామ్ తల్వార్ గూఢచారి కాకముందు భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు(freedom fighter). 1941లో సుభాష్ చంద్రబోస్ గృహనిర్భంధంలో ఉన్న సమయంలో ఆయనను విడుదల చేయడంలో సిల్వర్ కీలక పాత్ర పోషించారని చెబుతారు.
నేతాజీ(Netaji)తో పాటు సిల్వర్ కోల్‌కతా నుండి కాబూల్ వరకు ప్రయాణించాడంటారు. భగత్ రామ్ తల్వార్ గూఢచారి అయినప్పటికీ, పలువురు నేతలకు సైతం ఈ వాస్తవం గురించి తెలియదు. దీనిని చూస్తే సిల్వర్ తన పనిలో ఎంత నిపుణుడో(expert) సులభంగా గ్రహించవచ్చు. సిల్వర్‌కి సంబంధించిన కథలు ఎంతో థ్రిల్లింగ్(Thrilling)గా ఉంటాయి. వాటిపై ఒక పుస్తకం కూడా వెలువడింది. ప్రఖ్యాత రచయిత, జర్నలిస్ట్ మిహిర్ బోస్(Journalist Mihir Bose) తన పుస్తకంలో (సిల్వర్: ది స్పై హూ ఫూల్డ్ ది నాజీస్) భగత్‌రామ్‌ను రెహ్మత్ ఖాన్ పేరుతో కూడా పిలుస్తారని... అయితే అత్యంత ప్రాచుర్యం పొందిన పేరు సిల్వర్ అని రాశారు. ఈ పుస్తకంలో రెండవ ప్రపంచ యుద్ధం(Second World War) నాటి అనేక గూఢచర్య కథలు కనిపిస్తాయి.