EPFO: ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు 2023

 EPFO: 2674 Social Security Assistant Posts in EPFO

EPFO: 2674 Social Security Assistant Posts in EPFO

Employees Provident Fund Organization, New Delhi... is inviting online applications from eligible candidates for filling up the posts of Social Security Assistant in EPFO- Region wise on a regular basis across the country.

Details:

Social Security Assistant (SSA- Group C): 2674 Posts (39 Vacancies in Andhra Pradesh Region, 116 Vacancies in Telangana Region)

Category wise vacancies: SCs 359, STs 273, OBC(NCL) 514, EWS 529, Unreserved 999.

EPFO: ఈపీఎఫ్‌వోలో 2674 సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులు

న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్… దేశ వ్యాప్తంగా రెగ్యులర్‌ ప్రాతిపదికన ఈపీఎఫ్‌వో- రీజియన్ల వారీగా సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్(ఎస్‌ఎస్‌ఏ- గ్రూప్ సి): 2674 పోస్టులు (ఆంధ్రప్రదేశ్ రీజియన్‌లో 39, తెలంగాణ రీజియన్‌లో 116 ఖాళీలు ఉన్నాయి)

కేటగిరీ వారీగా ఖాళీలు: ఎస్సీలకు 359, ఎస్టీలకు 273, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)లకు 514, ఈడబ్ల్యూఎస్‌లకు 529, అన్‌ రిజర్వ్‌డ్‌కు 999 కేటాయించారు.

అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిమిషానికి 35 ఇంగ్లిష్‌ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్‌లో టైపింగ్ చేయగల నైపుణ్యం కలిగి ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3-8 ఏళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.29,200 - రూ.92,300.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష విధానం: ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్‌ విధానంలో 150 ప్రశ్నలకు 600 మార్కులు కేటాయించారు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌(30 ప్రశ్నలు), జనరల్‌ నాలెడ్జ్‌/ జనరల్‌ అవేర్‌నెస్‌(30 ప్రశ్నలు), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ(30 ప్రశ్నలు), జనరల్‌ ఇంగ్లిష్‌(50 ప్రశ్నలు), కంప్యూటర్‌ లిటరసీ(10 ప్రశ్నలు) అంశాల్లో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది). 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు/ రిజిస్ట్రేషన్ తేదీలు: 27-03-2023 నుంచి 26-04-2023 వరకు.

దరఖాస్తు సవరణ తేదీలు: 27-04-2023 నుంచి 28-04-2023 వరకు.

Website Here

Notification Here

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.