Half a glass is enough. Reduces sugar levels and keeps them from rising. Not in life.
Diabetes magical drink: In recent times, diabetes has been affecting everyone irrespective of age. Once you have diabetes, you have to take medication for life.
If diabetes is not under control, there will be many types of problems related to heart, kidney and eye.
In a way, diabetes can be said to be a silent killer. Hence diabetes must be kept under control. Blood sugar levels are under control if this remedy is followed by using drugs to control diabetes.
అర గ్లాస్ తాగితే చాలు . షుగర్ లెవెల్స్ ను తగ్గించి పెరగకుండా చేస్తుంది . జీవితంలో ఉండదు.
Diabetes magical drink : ఈ మధ్య కాలంలో డయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. డయాబెటిస్ ఒకసారి వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే.
డయాబెటిస్ నియంత్రణలో లేకపోతే గుండె, కిడ్నీ, కంటికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వస్తాయి.
ఒక రకంగా చెప్పాలంటే డయాబెటిస్ ని సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. అందువల్ల డయాబెటిస్ నియంత్రణలో తప్పనిసరిగా ఉంచుకోవాలి. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోవటానికి మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే ఈ రెమిడి ఫాలో అయితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఒక బౌల్ లో ఎండిన ఉసిరికాయ ముక్కలు, ఒక చిన్న కప్పు నీటిని వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు నీటిని పోయాలి. ఆ తర్వాత నానపెట్టి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కలను నీటితో సహ వేయాలి. ఆ తర్వాత అర స్పూన్ పసుపు కూడా వేయాలి.
ఈ నీరు సగం అయ్యేవరకు మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని వడగట్టి తాగాలి. ఈ డ్రింక్ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి గంట ముందు తాగాలి. ఈ విధంగా తాగుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరం డిటాక్స్ అవుతుంది. శరీరంలో కొవ్వు కరగటానికి కూడా సహాయపడి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
ఉసిరి రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు లేకుండా చేస్తుంది. ఉసిరిలో క్రోమియం ఉండుట వలన ఇన్సులిన్ వలే పనిచేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. పసుపులో పుష్కలంగా లభించే కర్క్యుమిన్ కారణంగా డయాబెటిస్ రోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కర్క్యుమిన్ అనేది బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.