Copper: What are the benefits of wearing copper items?
They usually wear jewelery made of silver, gold and diamonds.
Silver and gold ornaments are worn more than diamonds. But very few people use copper items.
Copper: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?
సాధారణంగా వెండి,బంగారం,వజ్రాలతో తయారుచేసిన ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు.
వజ్రాల కంటే వెండి బంగారు ఆభరణాలను ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే రాగితో తయారు చేసిన వస్తువులను వాడుతూ ఉంటారు.
అయితే వెండి, బంగారు ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే. కానీ రాగి వస్తువులను ధరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం ఎవరికీ తెలియదు. పూర్వం రోజుల్లో ఎక్కువగా రాగి వస్తువులను వాడేవారు.
ఇప్పుడు కూడా చాలా అరుదుగా వాడుతున్నారు. మరి ముఖ్యంగా కొత్తగా రాగి బాటిల్స్, రాగి ప్యూరిఫైయర్స్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. ఇక రాగి ఉంగరాలను, కడియాలను కూడా చాలా మంది ధరిస్తూ ఉంటారు.
సూర్య కిరణాల కారణంగా ఏర్పడే జబ్బులను రాగి అడ్డుకుంటుంది. రాగి కడియాలు లేదా ఉంగరాలు కానీ ధరించడం వల్ల కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
అలాగే శరీరంలోని విష పదార్ధాలను బయటకు పంపిస్తాయి. అలాగే కొన్ని రాగి ఉంగరాలు, కడియాలు ధరిస్తే వేడి తగ్గుతుంది.
మన దేశం ఉష్ట్న దేశం కాబట్టి ఒంట్లో ఉన్న వేడి తగ్గించడంలో సహాయ పడుతుంది. అలాగే హృదయ సంబంధింత సమస్యలు కూడా దరి చేరవు.
రాగి ధరించడం వల్ల మర్యాద పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.