chanakya niti: The wise do not live such a life... They implement both and pave the way for success!
Acharya Chanakya has given many details in his ethics about how to succeed in every field. These details are very useful for everyone everywhere.
chanakya niti: తెలివైనవారు అలాంటి జీవితం గడపరు... ఆ రెండింటినీ అమలు చేసి విజయానికి బాటలు వేసుకుంటారు!
ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రతి రంగంలోనూ ఎలా విజయం సాధించాలనే దాని గురించి అనేక వివరాలను అందించారు. ఈ వివరాలు అందరికీ ప్రతిచోటా ఎంతగానో ఉపయోగపతాయి.
చాణక్యుడి విధానాలు వైవాహిక జీవితంలోనూ ఉపయోగపడతాయి. అయితే ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి పురుషులు, స్త్రీలు ఎప్పుడూ వెనుకాడకూడదని, లేకుంటే వారు తర్వాత పశ్చాత్తాపపడతారని తెలిపారు.
ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం స్త్రీ లేదా పురుషుడు అనే తేడా లేకుండా ఎవరైనా సరే నియమాలు, క్రమశిక్షణ లేకుండా ఏదీ సాధించలేరని తెలిపాడు.
మనిషి ఏ రంగంలో విజయవంతం కావాలన్నా కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ఎంతో ముఖ్యం. జీవితంలో ఏదో సాధించడానికి ప్రతీసారీ కొత్త అనుభవాన్ని పొందాల్సిన అవసరం లేదని, మరొకరు పొందిన అనుభవం నుంచి గ్రహించవచ్చని ఆచార్య చాణక్యుడు చెప్పారు.
ఇతరుల అనుభవాల నుండి నేర్చుకుని ముందుకు సాగేవాడే తెలివైనవాడని పేర్కొన్నారు. గతంలోనే చిక్కుకుపోకుండా వర్తమానంపై దృష్టి సారించేవారే తెలివైనవారని అభివర్ణించారు.
ఎల్లప్పుడూ పాత జ్ఞాపకాలలో జీవించడం తెలివైన పని కాదని, ముఖ్యంగా ఈ జ్ఞాపకాలు చెడుగా ఉన్నప్పుడు.. వాటిని గుర్తు చేసుకునే వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేక వెనుకబడిపోతారని ఆచార్య చాణక్య తెలిపారు.
ఉదాహరణకు వ్యాపారంలో నష్టాలు ఇలానే జరుగుతాయన్నారు. అటువంటి పరిస్థితిలో గతంలో ఎదురైన నష్టానికి పశ్చాత్తాపం చెందే బదులు, ప్రస్తుత సమయంపై దృష్టి పెట్టడం ద్వారా మాత్రమే విజయం సాధించవచ్చని ఆచార్య చాణక్య సూచించారు.