Central Government Jobs: 7,500 central government jobs on degree.. Full details..!
Good news for the unemployed.. Another huge job notification has come from the Staff Selection Commission (SSC). Applications are invited for filling up the posts in various Ministries/Departments/Institutions of the Central Govt.
Combined Graduate Level Examination will be conducted for Group B and Group C posts. Applications are invited from April 3 for these jobs based on degree qualification. Eligible and interested candidates can apply till May 3.
Central Government Jobs: డిగ్రీపై 7,500 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుంచి మరో భారీ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వశాఖలు/విభాగాలు/సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
గ్రూప్ బి, గ్రూప్ సీ పోస్టుల కోసం కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలు నిర్వహించనుంది. డిగ్రీ అర్హతపై ఈ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు మే 3వరకు దరరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొంది.
పోస్టుల వివరాలివే..
ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా పలు శాఖల్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీబీడీటీలో ఇన్‌కం ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సీబీఐలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఎన్‌హెచ్ఆర్‌సీలో రీసెర్చి అసిస్టెంట్, ఎన్‌ఐఏలో సబ్ ఇన్‌స్పెక్టర్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సబ్ ఇన్‌స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, కాగ్‌లో ఆడిటర్, అకౌంటెంట్, తపాలాశాఖలో పోస్టల్ అసిస్టెంట్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సీబీడీటీలో ట్యాక్స్ అసిస్టెంట్, నార్కొటిక్స్ బ్యూరో, ఆర్థికమంత్రిత్వశాఖలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు ఉన్నాయి.
వేతనం: నెలకు రూ.25,500ల నుంచి రూ.1,51,100 (ఆయా పోస్టులను బట్టి)
వయో పరిమితి: ఆయా ఉద్యోగాలకు కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్ల పాటు వయో సడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా వయో సడలింపు ఇచ్చారు.
దరఖాస్తు రుసుం రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన వారు దరఖాస్తు రుసుం చెల్లించనవసరంలేదు. దరఖాస్తు రుసుం రిఫండ్ లేదు.
ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. టైర్ 1 పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. టైర్ 2 పరీక్షలో మూడు పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ముఖ్యమైన తేదీలివే..
దరఖాస్తులు: ఏప్రిల్ 3 నుంచి మే 3 వరకు
ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపునకు తుది గడువు: మే 4 రాత్రి 11గంటల వరకు
దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ: మే 7 నుంచి 8వరకు
టైర్ 1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష జులైలో ఉంటుంది
టైర్ 2 పరీక్షలకు తేదీలను తర్వాత ఖరారు చేస్తారు.