Brain Sharp Tips : Feed these to children to keep their brain sharp during exams.
Brain Sharp Tips : Many children do not remember what they have read during the exam.. They depend on what they have read at that time.. But if children are given these foods during the exam, their brain will be sharp.
Brain Sharp Tips : పిల్లలకు పరీక్ష సమయంలో బ్రెయిన్ షార్ప్ గా ఉండాలంటే ఇవి తినిపించండి.
Brain Sharp Tips : చాలామంది పిల్లలకు పరీక్ష సమయంలో ఏది చదివిన సరిగా గుర్తుండదు.. ఆ సమయంలో ఏది చదివిన బట్టి పడుతూ ఉంటారు.. అయితే పిల్లలకు పరీక్ష సమయంలో ఈ ఆహార పదార్థాలను పెడితే వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా తయారవుతుంది.
ఏది తీసుకున్న ఆరోగ్యంతో పాటు మెదడుపై కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మెదడు మొత్తం శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది. కావున ఆరోగ్యంగా ఉండడం చాలా ప్రధానం. మనసు ఆరోగ్యంగా లేకపోతే మన సామర్థ్యం కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆహారం సరి అయింది అయితే మెదడు కూడా షార్ప్ గా పని చేస్తూ ఉంటుంది. తన సామర్థ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. మనసు ప్రశాంతత కావాలంటే మెదడు కూడా ఆరోగ్యంగా ఉంచాలి. అయితే ఈ మెదడు షార్ప్ గా ఉండాలి అంటే ఈ ఐదు రకాల ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవడం చాలా ముఖ్యం..
ప్రధానంగా పిల్లలకు పరీక్ష టైంలో ఇవి బాగా పనిచేస్తాయి. ఒకసారి ఏది చదివిన వాళ్లు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఈ ఆహారం పిల్లల్లో జ్ఞాపకశక్తిని పెరిగేలా చేస్తాయి. ఈ ఐదు రకాల ఆహార పదార్థాలు గురించి ఇప్పుడు మనం చూద్దాం… ఈ ఆహారం మీ మెదడు ను షార్ప్ గా తయారు చేస్తుంది…
బాదం : మెదడు పనితీరును పెంచడంలో బాదం చాలా బాగా ఉపయోగపడుతుంది. మెదడుని షార్ప్ గా చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తుంది. నిత్యం బాదం పప్పు తీసుకుంటే వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గిపోతాయి. ఆలోచన శక్తి పెరుగుతుంది. బాదంపప్పులో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. గుమ్మడికాయ గింజలు : చాలామంది గుమ్మడికాయ గింజలు పడేస్తూ ఉంటారు. అయితే ఇది అద్భుతమైన ఆహారం.
దీని ధర కిలో 600 రూపాయలు కావడానికి మూలకారనంమిదే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్, జింకు ,కాపర్ లాంటి మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనస్సుని షార్ఫ్ చేస్తాయి. గుమ్మడికాయ గింజలలో చాలా సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. దీని కారణంగా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మొదడు సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి.
పసుపు : పసుపు వినియోగం ద్వారా ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదంలో పసుపుకి ప్రత్యేక స్థానం ఉంది. పసుపు ఆరోగ్య రక్షణగా గానే కాకుండా మెదడు షార్ప్ గాఉంచడానికి కూడా సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కమిన్ సమ్మేళనం మెదడు పనితీరును పెరిగేలా చేస్తుంది. అలాగే అల్జీమర్ లాంటి మతిమరుపు సమస్యను కూడా తగ్గిస్తుంది. మెదడులోని అమిలాయిడ్ శిధిలాలను కూడా తొలగిస్తుంది..
డార్క్ చాక్లెట్స్ : చాక్లెట్ ఇష్టమైతే డార్క్ చాక్లెట్లు తినడం చాలా మెలు జరుగుతుంది. ఇది మెదడుని చాలా షార్ప్ గా ఉంచుతుంది. ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు, డార్క్ చాక్లెట్లు ఉంటాయి. హైట్స్ మీ లెర్నింగ్ మెమొరీ సామర్థ్యాన్ని పెంచుతాయి. డార్క్ చాక్లెట్లు తీసుకోవడం వలన మీ పరీక్షలు ఉత్తీర్ణ సాధించే సామర్థ్యం కూడా పెరుగుతుంది.
బ్లూ బెర్రీస్ : మీ మెదడు పనితీరు చురుగ్గా ఉండాలంటే ఆహారంలో బ్లూబెర్రీస్ తప్పనిసరిగా తీసుకోవాలి. స్ట్రాబెరీలు, బ్లూబెర్రీస్, బెర్రీలు మల్బరీ లాంటి పండ్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్లూ బెర్రీస్ లో యాంటీ ఇన్ఫ్లోమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీని కారణంగా మెదడులో వాపు ఉండదు. ఇది శరీరం నుండి ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది..