There is so much technology in the earthen pot! Antidote to sugar? What is the link to sugar is unbelievable!
The days have come when our grandmothers used to say that their mothers used to cook in earthen pots.
We are told that the karma should be cooked in an earthen vessel. But don't you know the greatness of all that earthen vessels? Health problems can be avoided by using non-stick stainless steel aluminum utensils.
మట్టి పాత్రలో అంత టెక్నాలజీ ఉందా! షుగర్ కు విరుగుడా? షుగర్ కు దీనికి లింకేమిటి నమ్మలేని నిజమిది!
మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ల అమ్మలు కాలంలో వంటచేశావారంట అని చెప్పుకొనే రోజులు వచ్చేశాయి.
మట్టి పాత్రలో వండుకోవలసిన కర్మ మాకేమిటి అంటున్నారు.అయితే అదంతా మట్టి పాత్రలు గొప్పతనం తెలియకే? నాన్ స్టిక్ స్టైయన్ లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్యసమస్యలు తప్పవు..ఇంక కొంతమంది పెద్దలు మట్టి పాత్రలు ద్వారా ఆహారాన్ని తీసుకోవటం ద్వారా #ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్యనిపుణులు చెపుతున్నారు!కాబట్టి మనం మట్టి పాత్రలు ద్వారా వంటచేయటం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
నిజానికి మట్టి పాత్రలో వంటచేస్తే చాలా రుచిగా ఉంటుంది.ఎక్కవ కాలం చెడిపోకుండా నిలువ వుంటాయి.కావాలంటే మీ అమ్మమ్మనో నాయనమ్మనో అడగండి. అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం మన ఆరోగ్యానికి కావలసి18 రకాల ""#మైక్రోన్యూక్లియన్స్"" ఈ మట్టిలో వున్నాయి.మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్టు ఏమిటంటే ఈపధార్ధములో ఒక్క మైక్రో న్యూట్రియన్స్ కూడా తగ్గలేదు. మామూలు పాత్రలో వండిన పదార్థాలలో 7%,13% మాత్రమే మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.మట్టి పాత్రలో మాత్రము 100%మైక్రో న్యూట్రియన్స్ వున్నాయి.ఈ పదార్థాలకి #రుచి కూడా అద్బుతంగా వుంటుంది.అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని #సిరామిక్ అంటారు.ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇన్ప్రారెడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి.ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది.
మీకు గుర్తుండే వుంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే పసికర్లు లేక ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంక్యుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటలు పాటు వుంచుతారు.ఆ పరికరంలో వుండే లైట్ ద్వారా ఇన్ప్రారెడ్ కిరణాలు ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు..కేవలం కొద్దిగంటల్లోనే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్నిచ్చే శక్తి ఈకిరణాలకే వుంది. కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ వుందన్నమాట. జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరిమీద ఆదారపడకుండా జీవించగలం. ఇది కూడా మట్టి పాత్రలో వంటచేసి తినడం ద్వారా నే..
చక్కెర వ్యాధి వున్న వారికి ఈ మట్టి పాత్రలు ద్వారా వండిపెడితే కొన్ని నెలలు లోపే #డయాబిటీస్ నుండి విముక్తులను చేయండి ఆనందంగా జీవంచనీయండి............
మట్టికుండలోని నీళ్లు చల్లగా ఉండడం..
ఫ్రిజ్‌లో కాకుండా రంజన్‌లో చల్లబడే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మట్టితో తయారు చేసిన కుండల్లో కొన్ని పోషకాలు నీటితో జతకలిసి ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. పూర్వకాలం నుంచి ప్రజలు అన్ని కాలాల్లో మట్టితో చేసిన పాత్రలతోనే నీటిని చల్లబరుచుకునే వారు. దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.
సూక్ష్మరంధ్రాలతో నీటిని చల్లబరిచే విధానం..
సాధారణంగా ఫ్రిజ్‌లో గ్యాస్, విద్యుత్‌లను ఉపయోగించి నీటిని చల్లబరుస్తారు. కానీ, మట్టి పాత్రల్లో వాతావరణంలో ఉండే గాలితో #బాష్పోత్సేకం ప్రక్రియతో నీటిని చల్లబర్చుకోవడానికి మట్టిలోని సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడుతాయి.
మట్టిలో ఉండే క్షారగుణం ఆరోగ్యానికి లాభం..
మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి అసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని పీహెచ్(pH) నిల్వలను సమతుల్యంగా ఉంచుతుంది. మట్టి నీళ్ల వల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది.
జీవక్రియ మెరుగుపడును
సాధారణంగా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగ డం ద్వారా అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి. జీవక్రియ సమతూల్యంగా ఉండదు. దీని మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. కానీ, మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తవుతుంది.
వడదెబ్బను అరికడుతుంది
ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో బేధాలు ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కానీ మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల శరీరంపై ఎలాంటి వడదెబ్బ ప్రభావం ఉండదు.