BITSAT: BITSAT-2023
Birla Institute of Technology and Science (BITS), Pilani, Rajasthan has released the Birla Institute of Technology and Science Admission Test (BITSAT)-2023 notification. Admissions to integrated first degree programs are through an entrance examination. Admissions can be done in Hyderabad Campus, Pilani Campus, KK Birla Goa Campus. There are admissions in BE, BTech, BPharmacy, MSc courses. Candidates admitted to the M.C. program have the option of entering the Engineering Dual Degree after the first year.
BITSAT: బిట్‌శాట్-2023
రాజస్థాన్ రాష్ట్రం పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(బిట్స్)- బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్(బిట్‌శాట్)-2023 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రవేశ పరీక్ష ద్వారా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాంలలో ప్రవేశాలు ఉంటాయి. హైదరాబాద్ క్యాంపస్, పిలానీ క్యాంపస్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలో ప్రవేశాలు పొందవచ్చు. బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు ఉంటాయి. ఎమ్మెస్సీ ప్రోగ్రాంలో ప్రవేశం పొందిన అభ్యర్థులు మొదటి సంవత్సరం తర్వాత ఇంజినీరింగ్ డ్యూయల్ డిగ్రీలో ప్రవేశించే అవకాశం ఉంటుంది.
క్యాంపస్ వారీగా ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ ప్రోగ్రాం:
I. బిట్స్ పిలానీ- పిలానీ క్యాంపస్:
1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, మాన్యుఫ్యాక్చరింగ్.
2. బీఫార్మసీ
3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
4. ఎంఎస్సీ: జనరల్ స్టడీస్.
II. బిట్స్ పిలానీ- కేకే బిర్లా గోవా క్యాంపస్:
1. బీఈ: కెమికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.
2. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
III. బిట్స్ పిలానీ - హైదరాబాద్ క్యాంపస్:
1. బీఈ: కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్.
2. బీఫార్మసీ
3. ఎంఎస్సీ: బయోలాజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్.
అర్హత: అభ్యర్థులు 75 శాతం మార్కులతో(గ్రూపు సబ్జెక్టుల్లో ఒక్కోదానిలో కనీసం 60 శాతం మార్కులు) ఇంటర్మీడియట్/ పన్నెండో తరగతి(ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్/బయాలజీ) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: బిట్‌శాట్-2023 టెస్టు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: బిట్‌శాట్-2023 టెస్టు రెండు సెషన్లలో జరుగుతుంది. అభ్యర్థులు రెండు సెషన్లు రాయవచ్చు. రెండింటిలో బెస్ట్ స్కోరునే పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు రుసుము: సెషన్-1, 2 పరీక్షలకు రూ.5400 (పురుషులకు); రూ.4400 (మహిళలకు).
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 09-04-2023.
దరఖాస్తు సవరణ తేదీలు: 16 నుంచి 20-04-2023 వరకు.
బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-1: 21 నుంచి 26-05-2023 వరకు.
బిట్‌శాట్ ఆన్‌లైన్ టెస్ట్ సెషన్-2: 18 నుంచి 22-06-2023 వరకు.