Apply For Irctc Agent : ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.80 వేలు సంపాదించే చాన్స్.. ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా సువర్ణ అవకాశం..

 Apply For Irctc Agent : Chance to earn Rs. 80 thousand per month by staying at home.. Golden opportunity as Irctc agent..

Many aspire to get a job in railways. However, in today's times, getting a job has become a bit difficult as the number of vacancies is less along with fierce competition.

Apply For Irctc Agent : ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.80 వేలు సంపాదించే చాన్స్.. ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా సువర్ణ అవకాశం..

Apply For Irctc Agent : Chance to earn Rs. 80 thousand per month by staying at home.. Golden opportunity as Irctc agent.. Many aspire to get a job in railways. However, in today's times, getting a job has become a bit difficult as the number of vacancies is less along with fierce competition.

చాలా మంది రైల్వేలో ఉద్యోగం కోసం ఆశపడుతుంటారు. అయితే, నేటి కాలంలో తీవ్రమైన పోటీతో పాటు ఖాళీల సంఖ్య తక్కువగా ఉన్నందున ఉద్యోగం సంపాదించడం కొంచెం కష్టంగా మారింది.

ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేలో కలిసి సంపాదించే అవకాశం ఉంది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ)తో పని ప్రారంభించడం ద్వారా మీరు చక్కగా సంపాదించవచ్చు. దీని కోసం మీరు ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారితే సంపాదించుకునేందుకు చాలా మంచి మార్గంగా ఉంటుంది. ఈ పనిని రైల్ ట్రావెల్ సర్వీస్ ఏజెంట్‌గా పరిగణిస్తారు. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో నుంచే కంప్యూటర్‌లో ఈ పని చేసుకోవచ్చు. అలాగే రైల్వేలో టికెట్ గుమాస్తాలు ఏ పని అయితే చేస్తారో? మీరు ఇంటి వద్ద నుంచి అదే పని చేయాలి. మీరు బుక్ చేసిన టికెట్లకు రైల్వే శాఖ కమిషన్ ఇస్తుంది. ఏజెంట్‌గా రైల్వే కౌంటర్లలో గుమాస్తాలు టిక్కెట్లు తీసివేసినట్లు, అదే విధంగా మీరు కూడా ప్రయాణీకులకు టిక్కెట్లు తీసివేయాలి. ఇందులో టికెట్ కటింగ్ కోసం ఏజెంట్‌కి కమీషన్ వస్తుంది. దీని ద్వారా ఏజెంట్లు ఇ-టికెట్లను బుక్ చేసుకోవచ్చు.

సంపాదన ఇలా

నాన్ ఏసీ కోచ్ టిక్కెట్‌ను బుక్ చేసుకున్నందుకు ఒక్కో టికెట్‌కు రూ.20, ఏసీ క్లాస్ టికెట్‌ను బుక్ చేస్తే రూ.40 చొప్పున ఏజెంట్‌కు కమీషన్‌గా లభిస్తుంది. అలాగే టికెట్ ధరలో ఒక శాతం కూడా ఏజెంట్‌కు ఇస్తారు. ఐఆర్‌సీటీసీ ఏజెంట్‌గా మారడం వల్ల పరిమితి లేకుండా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అలాగే 15 నిమిషాల్లో తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఏజెంట్‌గా మీరు దేశీయ, అంతర్జాతీయ విమాన టిక్కెట్‌లతో పాటు రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

రూ.80 వేల వరకూ సంపాదన

మీరు బుక్ చేసుకున్న టిక్కెట్ల ఆధారంగా మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. కాబట్టి, ఒక నెలలో బుక్ చేసుకునే టిక్కెట్ల సంఖ్యపై నెలలో మంచి బుకింగ్ లభిస్తే, అప్పుడు ఏజెంట్ నెలకు రూ. 80,000 వరకు సాధారణ ఆదాయాన్ని పొందవచ్చు. పని తక్కువైనా, నెమ్మదించినా సగటున రూ.40 వేల నుంచి రూ.50 వేలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఒక సంవత్సరానికి ఏజెంట్‌గా మారాలనుకుంటే, ఐఆర్‌సీటీసీ రుసుము కింద రూ.3,999 చెల్లించాల్సి ఉంటుంది, అయితే రెండు సంవత్సరాలకు ఈ ఛార్జీ రూ. 6,999 చెల్లించాలి. ఏజెంట్‌గా నెలలో 100 టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఒక్కో టికెట్‌కు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.