తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9,231 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల కు నోటిఫికేషన్లు విడుదల

 9,231 teaching in Gurukuls in Telangana state

9,231 teaching in Gurukuls in Telangana state

A notification has been released for the recruitment of large number of jobs in Gurukuls in Telangana state. For a total of 9,231 posts, the Recruitment Board of Gurukula Educational Institutions has released 9 notifications separately. It said that 868 faculty, physical director and librarian posts will be filled in degree colleges.

Also, short notification that 2,008 Lecturers in Junior Colleges, 1276 PGT, 434 Librarian, 275 Physical Director, 134 Arts, 92 Craft, 124 Music, 4020 TGT posts will be filled in schools.

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 9,231 టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టుల కు నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 9,231 పోస్టులకు గాను గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు 9 నోటిఫికేషన్లను విడివిడిగా విడుదల చేసింది. డిగ్రీ కళాశాలల్లో 868 అధ్యాపక, ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది.

అలాగే, జూనియర్ కళాశాలల్లో 2,008 లెక్చరర్లు, పాఠశాలల్లో,1276 పీజీటీ, 434 లైబ్రేరియన్, 275 ఫిజికల్ డైరెక్టర్, 134 ఆర్ట్స్, 92 క్రాఫ్ట్, 124 మ్యూజిక్, 4020 టీజీటీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు షార్ట్ నోటిఫికేషన్లలో పేర్కొంది.

ఏప్రిల్ 12 నుంచి వన్ టైం రిజిస్ట్రేషన్.. 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ మల్లయ్య భట్టు తెలిపారు.

సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన వర్గాల సంక్షేమ రెసిడెన్సియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలకు వేర్వేరుగా ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వయో పరిమితి, విద్యార్హత, ఇతర వివరాలతో పూర్తి నోటిఫికేషన్లు దరఖాస్తుల ప్రారంభమైన రోజు నుంచి తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయితే, ఈ కింద పేర్కొన్న పోస్టుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉండొచ్చని తెలిపింది. పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మొత్తం వివరాలపై ఓ స్పష్టత రానుంది. సొసైటీల వారీగా పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి

గ్రాడ్యుయేషన్ టీచర్ పోస్టులు 4,020 ఉండగా.. ఏప్రిల్ 28 నుంచి మే 27వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వేతన స్కేలు రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు ఉండనుంది.

డిగ్రీ కళాశాలల్లో మొత్తం 868 పోస్టులకు గాను వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630లుగా ఉంటుందని పేర్కొంది. వయో పరిమితి, పోస్టుల వారీగా వేతనం, కమ్యూనిటీ, విద్యార్హతలు, ఇతర వివరాలతో ఏప్రిల్ 17న పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వెబ్సైట్లో తెలిపింది. ఏప్రిల్ 17 నుంచి మే 17వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు వెల్లడించింది.

జూనియర్ కళాలల్లో 2008 పోస్టులకు (జూనియరల్ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్/ లైబ్రేరియన్) వేతనం రూ.54,220 నుంచి రూ.1,33,630 వరకు ఉంటుందని తెలిపింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 17 నుంచి మే 17 వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చని కన్వీనర్ పేర్కొన్నారు.

పోస్టు గ్రాడ్యుయేషన్ టీచర్ ఉద్యోగాల్లో మొత్తం 1,276 పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరించనున్నారు. ఇందులో పోస్టులకు వేతనం రూ.45,960 నుంచి రూ.1,24,150గా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ మూడు గురుకుల సొసైటీల్లోని పాఠశాలల్లో 434 లైబ్రేరియన్ పోస్టులకు ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. వేతనం రూ.38,890 నుంచి 1,12,510 గా ఉండనుంది. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు 275 ఉండగా.. వీటికి కూడా పైతేదీల్లోనే దరఖాస్తులు స్వీకరించనున్నారు. వేతనం రూ.42,300 నుంచి 1,15,270 మధ్య ఉండనుంది. ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ (134) పోస్టులు ఉండగా.. క్రాఫ్ట్ టీచర్, క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు 92 ఉన్నాయి. అలాగే, మ్యూజిక్ టీచర్ పోస్టులు 124 ఉన్నాయి.

NOTIFICATIONS 

4,020 - ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు

1,276 - పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు

2,008 - జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు

868 - డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు

434 - లైబ్రేరియన్(స్కూల్స్) పోస్టులు

275 - ఫిజికల్ డైరెక్టర్(స్కూల్స్) పోస్టులు

134 - ఆర్ట్ టీచర్, డ్రాయింగ్ టీచర్ పోస్టులు

124 - మ్యూజిక్ టీచర్ పోస్టులు

92 – క్రాఫ్ట్ టీచర్ పోస్టులు 

CAREERS PAGE

WEBSITE

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.