TS PGECET 2023
TS PGECET - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, పరీక్ష ఎప్పుడంటే?
పీజీఈసెట్ 2023 దరఖాస్తు ప్రక్రియ:
తెలంగాణలో TS PGECET-2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2 నుంచి 4 మధ్యలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ.250 ఆలస్య రుసుంతో మే 5 వరకు, రూ. 1000 ఆలస్య రుసుముతో మే 10 వరకు, రూ.2,500 ఆలస్య రుసుముతో మే 15 వరకు, రూ.5,000 ఆలస్య రుసుంతో మే 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ-హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్) 'టీఎస్ పీజీఈసెట్' నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది.
పరీక్ష విధానం:
మొత్తం 120 మార్కులకు కంప్యూటర్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. పరీక్షలో ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు, పరీక్షలో కనీస అర్హత మార్కులను 25 శాతం (30 మార్కులు)గా నిర్నయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
'TS PGECET-2023' షెడ్యూలు ఇలా..
➥ పీజీసెట్ నోటిఫికేషన్: 28.02.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03.03.2023.
➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ (అపరాద రుసుము లేకుండా: 30.04.2023.
➥ రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 05.05.2023.
➥ రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 10.05.2023.
➥ రూ.2500 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 15.05.2023.
➥ రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరితేదీ: 24.05.2023.
➥ దరఖాస్తు ఫీజు: రూ.1100, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.600
➥ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: 21.05.2023 నుంచి.
➥ పరీక్ష తేదీలు: 29.05.2023 - 01.06.2023 వరకు.

