Smart TVని క్లీన్ చేసే సమయంలో ఈ తప్పులు అసలు చేయకండి
Don't make these mistakes while cleaning Smart TV
Smart TV is usually cleaned regularly by everyone. Like other appliances, TV is also cleaned. But some precautions must be taken while cleaning Smart TV Screens. Otherwise there is a risk of damaging the TV screen. Scratches on the display are more likely if care is not taken. Nobody likes dust and stains on the TV screen. That's why they clean it. But it should be cleaned properly. These are the precautions to be taken while cleaning the Smart TV.
No towels, tissues
Most smart TV screens (LCD, LED, OLED) are sensitive. If you wipe with too much pressure, you will get scratches. Fibers on towels and tissues can also cause scratches on the screen. That is why it is better to use a soft microfiber cloth to clean the TV screen. A microfiber cloth is best for wiping dust and stains from the screen. Also don't wipe the screen. Wipe the screen as gently as possible. If you must use a towel, clean it gently.
స్మార్ట్ టీవీని (Smart TV) సాధారణంగా అందరూ తరచూ క్లీన్ చేస్తుంటారు. ఇతర అప్లియన్సెస్‌లాగానే టీవీని కూడా శుభ్రం చేస్తుంటారు. అయితే స్మార్ట్ టీవీ స్క్రీన్‌లను (Smart TV Screens) క్లీన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేకపోతే టీవీ స్క్రీన్ పాడయ్యే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే డిస్‌ప్లేపై స్క్రాచెస్ పడే అవకాశం ఎక్కువ. టీవీ స్క్రీన్‌పై దుమ్ము, మరకలు ఉండడం ఎవరికీ నచ్చదు. అందుకే క్లీన్ చేస్తుంటారు. అయితే సరైన విధానంలో శుభ్రం చేయాలి. స్మార్ట్ టీవీని క్లీన్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.
టవల్స్, టిష్యూలు వద్దు
చాలా స్మార్ట్ టీవీ స్క్రీన్స్ (LCD, LED, OLED) సెన్సిటివ్‌గా ఉంటాయి. ఎక్కువగా ఒత్తిడి చేసి తుడిస్తే స్క్రాచెస్ పడతాయి. టవల్స్, టిష్యూలపై ఉండే ఫైబర్స్ కూడా స్క్రీన్‌పై స్క్రాచెస్‌కు కారణం కావొచ్చు. అందుకే టీవీ స్క్రీన్‌ను శుభ్రం చేసేందుకు మృధువుగా ఉండే మైక్రోఫైబర్ క్లాత్‌నే వినియోగించడం మంచిది. స్క్రీన్‌పై ఉన్న దుమ్ము, మరకలను తుడిచేందుకు మైక్రోఫైబర్ క్లాత్ చాలా బెస్ట్. అలాగే స్క్రీన్‌ను గడ్డిగా అదిమకండి. వీలైనంత సున్నితంగానే స్క్రీన్‌పై తుడవాలి. ఒకవేళ తప్పక టవల్ వినియోగించాల్సి వస్తే చాలా జాగ్రత్తగా.. మృధువుగా క్లీన్ చేయాలి.
స్ప్రే డైరెక్ట్‌గా వద్దు
ఏదైనా సరే.. క్లీనింగ్ స్ప్రేను నేరుగా టీవీ స్క్రీన్‌పై చల్లకూడదు. క్లీన్ చేసేందుకు తీసుకున్న క్లాత్‌పై ముందుగా స్ప్రే చేయాలి. ఆ తర్వాత ఆ క్లాత్‌తో టీవీ స్క్రీన్‌ను తుడవాలి. ఒకవేళ డైరెక్ట్‌గా స్ప్రే చేస్తే పర్మినెంట్‌గా మరకలు పడే ప్రమాదం ఉంటుంది.
అమ్మోనియా, అల్కాహాల్, అసిటోన్ కలిగి ఉన్న స్ప్రేలను టీవీ స్క్రీన్ క్లీనింగ్ కోసం వాడకూడదు. వీటివల్ల డిస్‌ప్లేపై ఉండే యాంటీ గ్లేర్ కోటింగ్ దెబ్బతింటుంది.
గజిబిజిగా వద్దు
టీవీ స్క్రీన్‌ను గజిబిజిగా తుడవకూడదు. తొలుత ఒక డైరెక్షన్‌లో.. ఆ తర్వాత వ్యతిరేక దిశలో క్లాత్‌తో క్లీన్ చేయాలి. అంటే ఒకసారి అడ్డంగా.. ఆ తర్వాత నిలువుగా శుభ్రం చేయాలి. ఇలా జాగ్రత్తగా తుడిస్తే చుక్కలు, గీతలు పడవు. అందుకే ఎప్పుడూ గజిబిజిగా స్క్రీన్‌ను శుభ్రం చేయకండి.
అలాగే స్క్రీన్‌ను తుడిచే సమయంలో క్లాత్‌కు ఎక్కువ దుమ్ము అంటినట్టు అనిపిస్తే.. వెంటనే క్లాత్‌ను మార్చాలి. వేరే క్లాత్‌తో క్లీనింగ్ కొనసాగించాలి.
ఆన్‌లో అసలు వద్దు
టీవీ ఆన్‌లో ఉన్నప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ స్క్రీన్‌ను క్లీన్ చేయకూడదు. ఆఫ్ చేసిన తర్వాతే చేయాలి. క్లీనింగ్ పూర్తయ్యాక లిక్విడ్ అరిపోయి.. పూర్తి పొడిగా మారిన తర్వాతే.. టీవీని ఆన్ చేయాలి. తడిగా ఉన్నప్పుడు ఆన్ చేయకూదని గుర్తుంచుకోవాలి.

