Postal Account Charges 2025

 Postal Account Charges 2025

Postal Account Charges: మీకు పోస్టాఫీస్‌ ఖాతా ఉందా? ఈ సేవలపై ఎంత చార్జీ విధిస్తున్నారో తెలిస్తే అ‍వ్వాకవుతారు..

Postal Account Charges 2025

కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దాచుకోవడానికి భారతీయులు ఎక్కువగా బ్యాంకుల కంటే పోస్టాఫీసులనే నమ్ముతారు. ఎందుకంటే దాచిన సొమ్ముకు ప్రభుత్వ హామీతో పాటు సొంతూరులో అన్ని సేవలను పొందవచ్చే ఉద్దేశంతో పోస్టాఫీసుల్లో సొమ్ము దాచుకోడానికి ఇష్టపడతారు. ఖాతాదారులు, పౌరుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు ఇండియన్‌ పోస్ట్స్‌ కూడా దాదాపు  1.5 లక్షల శాఖలతో సేవలను అందిస్తుంది. ముఖ్యంగా దాచుకున్న సొమ్ముకు ఆర్థిక భద్రత ఉంటుందని ఎక్కువ మంది పోస్టాఫీసు ఖాతాల్లో తమ సొమ్మును నిల్వ చేసుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి బ్యాంకు ఖాతా లేకపోయినా కచ్చితంగా పోస్టాఫీస్‌ ఖాతా ఉంటుంది. దీన్ని బట్టే మనం భారతీయులు పోస్టాఫీసులను ఎంతగా నమ్ముతారో? అర్థం చేసుకోవచ్చు. 

పెట్టుబడి అంశాలపైనే కాకుండా పోస్టాఫీసుల్లో సేవింగ్స్‌ ఖాతాల ద్వారా సేవలను పొందవచ్చు. ఇక్కడ ఖాతాదారులు బ్యాంకు సేవల మాదిరిగానే సొమ్మును డిపాజిట్‌, లేదా విత్‌ డ్రా చేసుకోవచ్చు. మీకు పోస్టాఫీస్‌ ఖాతా ఉన్నా.. లేకపోతే కచ్చితంగా ఖాతా తీసుకోవాలనుకున్నా సేవింగ్స్‌ ఖాతా పోస్టాఫీసుల్లో విధించే వివిధ చార్జీలపై అవగాహన కలిగి ఉండడం చాలా ముఖ్యమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రకాల పోస్టాఫీసు సేవలను పొందడానికి నిర్ణీత మొత్తంలో చార్జీలు చెల్లించాల్సి వస్తుందనే విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా డూప్లికెట్‌ పాస్‌బుక్‌, ఖాతా స్టేట్‌మెంట్‌, డిపాజిట్‌ రసీదు, పాత పాస్‌ బుక్‌ భర్తీ, ఖాతా బదిలీ, చెక్‌ జారీ వంటి వాటిపై బ్యాంకుల్లాగానే పోస్టాఫీసుల్లో కూడా చార్జీలు విధిస్తారు. అయితే ఆ చార్జీలు చాలా తక్కువ ఉంటాయి. 

పోస్టాఫీసులో విధించే వివిధ చార్జీల గురించి ఓ సారి తెలుసుకుందాం.

డూప్లికెట్‌ పాస్‌ బుక్‌ : రూ.50

ఖాతా స్టేట్‌మెంట్‌ లేదా డిపాజిట్‌ రసీదు జారీ : రూ.20

చిరిగిన పాస్‌బుక్‌కు మరో పాస్‌బుక్‌ జారీ కోసం: రూ.10

ఖాతా రద్దు చేయడం లేదా నామినేషన్‌ మార్చడం : రూ.

ఖాతా బదిలీ : రూ.100

ఖాతాను తాకట్టు పెట్టడం : రూ.100

చెక్‌ బౌన్స్‌ : రూ.100

చెక్‌ బుక్‌: పది లీవ్స్‌ వరకూ ఉచితం.. ఆ తర్వాత పేజీకి రూ.2 చెల్లించాలి.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.