NEET UG NOTIFICATION 2023
NEET UG 2023: నీట్ యూజీ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండిలా..
జాతీయ స్థాయి ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో అత్యంత కఠినమైనదిగా నీట్ (NEET)ని భావిస్తారు. ఇందులో క్వాలిఫై అవ్వాలంటే విద్యార్థులు చాలా శ్రమించాలి. దేశంలోని మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడానికి నీట్‌ను అర్హత పరీక్షగా నిర్వహిస్తున్నారు. తాజాగా నీట్-2023 (NEET 2023) UG నోటిఫికేషన్ విడుదలైంది.
మే 7వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్ టీఏ పేర్కొంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 06, 2023గా నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ లింక్ https://neet.nta.nic.in/ ద్వారా అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించవచ్చు. నీట్ అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, సిలబస్ తదితర వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఇంటర్ పాసైన అభ్యర్థులతో పాటు ఈ సంవత్సరం ఇంటర్ సెకండియర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు నీట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సైన్స్ స్ట్రీమ్‌లో బయాలజీ తప్పనిసరి సబ్జెక్ట్‌గా ఉండాలి.
అంతేకాకుండా జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఇంటర్‌లో తప్పనిసరిగా కనీసం 50 శాతం స్కోర్, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం స్కోర్ చేసి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు కనీసం 17 సంవత్సరాలు ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
అప్లికేషన్ ప్రాసెస్ ఇలా..
ముందుగా ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లి నీట్ యూజీ-2023 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయాలి. దీంతో అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. అప్లికేషన్‌ను ఫిల్‌అప్ చేసి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత పేమెంట్ చేసి, అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం నీట్ యూజీ -2023 కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోవాలి.
ఎగ్జామ్ ప్యాట్రన్..
నీట్ పరీక్ష ఆఫ్‌లైన్‌లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో జరగనుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలు. నీట్ ప్రశ్నాపత్రం మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ రూపంలో ఉంటుంది. ఎగ్జామ్‌లో మొత్తంగా 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలో మూడు సెక్షన్స్ ఫిజిక్స్, కెమెస్ట్రీ, బయాలజీ ఉంటుంది. ప్రతి సెక్షన్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష మొత్తం 720 మార్కులకు ఉంటుంది.
ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగెటివ్ మార్కు ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి 50 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. బయాలజీ నుంచి మొత్తంగా 100 ప్రశ్నలు ఉంటాయి.
కాగా, నీట్-2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు.

