How much sugar to take in a day? 2023

How much sugar to take in a day? 

రోజులో ఎంత షుగర్‌ తీసుకోవాలంటే?

How much sugar to take in a day? 2023

మనం రోజులో ఎంత మొత్తంలో షుగర్‌ తీసుకోవాలి? మధుమేహస్తులు పండుగ సీజన్లలో చేసుకున్న స్వీట్లను తినొచ్చా? ఆ స్వీట్లతోపాటుగా స్పెషల్‌ వంటకాల్ని రుచి చూడొచ్చా? అలా తినడం వల్ల శరీరంలో షుగర్‌ స్థాయిలు పెరిగితే ఎలా నియంత్రణలో ఉంచుకోవాలి? వంటి ప్రశ్నలకు న్యూట్రీషియన్‌ ఏం చెబుతున్నారంటే..?!

- మధుమేహస్తులు తప్పనిసరిగా షుగర్‌ని ఎక్కువగా తీసుకోకూడదు. రోజూ తాగే టీ, కాఫీలలో చక్కెర ఉంటుంది. వీటితోపాటుగా పండుగ రోజుల్లో చేసుకునే పాయసం వంటి స్పెషల్‌ వంటకాల్లో కూడా స్వీట్‌ ఎక్కువగా ఉంటుంది. టీ, కాఫీలతోపాటు, స్పెషల్‌ వంటకాలను తినడం వల్ల షుగర్‌ స్థాయిలు పెరిగే ప్రమాదముంది. షుగర్‌ స్థాయిలు పెరగకుండా ఉండాలంటే.. చక్కెర కలిపిన పదార్థాలను మితంగా తీసుకోవాలని న్యూట్రీషియన్‌ రుజుతా దివాకర్‌ చెబుతున్నారు.

- డయాబెటిస్‌తో బాధపడేవారు షుగర్‌ స్థాయిలు అదుపులో ఉండాలి. అలాగని అస్సలు చక్కెర తీసుకోకుండా ఉన్నా ప్రమాదమే. మరి ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే.. బయట తయారుచేసిన స్వీట్లు కాకుండా.. ఇంట్లోనే మితంగా చక్కెరతో చేసిన స్వీట్లను తీసుకుంటేనే ఆరోగ్యం మంచిదని రుజుతా అన్నారు.

- రంగు, రుచి కోసం ఎక్కువ మంది స్వీట్లలో షుగర్‌ని ఉపయోగిస్తారు. చక్కెరతో చేసే పదార్థాలు కాకుండా... బెల్లంతో తయారుచేసిన వంటకాల్ని తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదముండదని ఆమె తెలిపారు. అయితే మీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మితంగానే తీపి పదార్థాలను తీసుకోవాలి.

- రోజులో 5 నుంచి 9 స్పూన్లు మాత్రమే షుగర్‌ తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. డబ్ల్యుహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం ప్రతిరోజూ 9 స్పూన్లకు మించి షుగర్‌ని తీసుకోకుండా ఉంటేనే మంచిదని రుజుతా అన్నారు.

- షుగర్‌ ఎక్కువగా తీసుకుంటే మధుహంతో బాధపడేవారు మాత్రమే కాదు.. డయాబెటిస్‌ లేనివారు కూడా పలు అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. అధిక బరువుతోపాటు, గుండె సంబంధిత సమస్యలతో బాధపడతారని వైద్యులు చెబుతున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.