Hormonal therapy has many benefits

Hormonal therapy has many benefits

హార్మోన్ల థెరపీ వల్ల ప్రయోజనాలెన్నో

Hormonal therapy has many benefits

మహిళలు తరచూ హార్మోన్ల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలకు వైద్యులను సంప్రదించి మందులు వాడుకున్నా కొంతవరకే ఉపశమనం కలుగుతుంది. శరీరంలో హార్మోన్ల స్థాయి తగ్గితే ఎముకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే ఈ సమస్యల నుంచి త్వరితగతిన ఉపశమనం పొందాలంటే.. హార్మోన్ల థెరపీ ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు. హార్మోన్‌ థెరపీ ఎముక ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. మెనోపాజ్‌ సమస్య దాటిన 10 సంవత్సరాల తర్వాత అయినా ఈ చికిత్స మంచి ఫలితాలనిస్తుందని వైద్యులు చెబుతున్నారు. గర్భాశయం తొలగించిన మహిళల్లో హార్మోన్ల ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుంది. 

మరి ఈ థెరపీని ఎలాంటి అనారోగ్య సమస్యలున్నవారో తీసుకోకూడదో తెలుసుకుందామా..!

- రొమ్ము క్యాన్సర్‌తో బాధపడేవారు హార్మోన్‌ థెరపీని తీసుకోకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- లివర్‌ సమస్యలతో బాధపడేవారు కూడా హార్మోన్‌ థెరపీ తీసుకోకూడదు.

- గర్భం దాల్చిన సమయంలోనూ ఈ థెరపీ తీసుకోకూడదు.

- ఈ థెరపీలో రక్తం గడ్డకట్టే అవకాశముంటుంది. అందువల్ల గుండెపోటుకి గురైన వారు ఈ థెరపీని తీసుకోకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.