మీ పెట్రోల్ ను సేవ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ Google మ్యాప్స్ ట్రిక్ ట్రై చేయండి
If you want to save your petrol then try this Google Maps trick
How many political parties have changed in India but they are unable to stop the rise in petrol and diesel prices. Not to mention the rising petrol and diesel prices and the traffic in our cities. Due to this we need to drive some extra kilometers to reach our destination. This will cost more petrol or diesel. And what do you think is the link to petrol and Google Maps? Google Maps helps us navigate through the available routes. Through Google Maps, users can easily move from one place to another.
We all know that these google maps will tell you which place has heavy traffic and other routes available to our destination. But, did you know that a navigation service can measure the distance between two or more destinations? Measuring the shortest distance between two or more destinations not only saves you time but also saves you petrol or diesel. Because the destination can be reached by looking at a short distance. So save time and save petrol. But there is an easy way how to do it. Follow the steps below and measure the distance easily.
ఇండియాలో ఎన్ని రాజకీయపార్టీలు మారిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడాన్ని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ పెరుతున్న పెట్రోల్,డీజిల్ ధరలతో పాటు మన నగరాలలో ఉండే ట్రాఫిక్ గురించి చెప్పక్కర్లేదు. దీనివల్ల మన గమ్యస్థలాన్ని చేరుకోవడానికి మరికొన్ని ఎక్స్ట్రా కిలోమీటర్స్ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం వుంది. దీనితో మరింత పెట్రోల్ లేదా డీజిల్ ఖర్చు అవుతుంది. మరి పెట్రోల్ కి, గూగుల్ మాప్స్ కి లింక్ ఏంటి అనుకుంటున్నారా? గూగుల్ మాప్స్ మనకు అందుబాటులో ఉన్న రూట్స్ ద్వారా నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. గూగుల్ మ్యాప్స్ ద్వారా, యూజర్లు సులభంగా ఒక ప్రదేశం నుండి ఇతర ప్రదేశానికి సులభంగా వెళ్ళిపోతారు.
ఈ గూగుల్ మాప్స్ మీకు ట్రాఫిక్ ఏ ప్లేస్ లో ఎక్కువగా ఉంది మరియు మన గమ్య స్థలానికి అందుబాటులో ఉండే ఇతర రూట్స్ గురించి తెలియజేస్తాయి అని అందరకి తెలుసు. కానీ, నావిగేషన్ సర్వీస్ ద్వారా రెండు మరియు అంతకంటే ఎక్కువ డెస్టినేషన్స్ మధ్య దూరాన్ని కోలుస్తుందని మీకు తెలుసా? రెండు లేదా అంతకంటే ఎక్కువ డెస్టినేషన్స్ మధ్య అతిచిన్న దూరాన్ని కొలవడం వల్ల కేవలం మీ సమయం ఆదాచేయడo మాత్రమే కాదు, మీ పెట్రోల్ లేదా డీజిల్ ని అలాగే సేవ్ చేస్తాయి. ఎందుకంటే తక్కువ దూరంను చూస్ చేసుకొని ఆ దారిలో గమ్యస్థానాన్ని చేరుకోవచ్చు. సో టైం సేవ్ అండ్ పెట్రోల్ సేవ్. కాని దీన్ని ఎలా చేయాలి అనేదానికి ఒక సులభమైన మార్గం ఉంది. కింది స్టెప్స్ ని ఫాలో అవండి, ఈజీగా డిస్టెన్స్ ని మెజర్ చేయండి.
డెస్క్ టాప్ పైన
1: మీరు కంప్యూటర్ లో వెబ్ బ్రౌజర్ లో Google Maps ను తెరవండి.
2: స్టార్టింగ్ పాయింట్ కి జూమ్ చేసి దానిపై రైట్ క్లిక్ చేయండి.
3: దీని తరువాత, డ్రిప్ డౌన్ మెను నుండి ‘మెజర్’ డిస్టెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి.
4: ఒకసారి సెలెక్ట్ చేసిన తర్వాత, మీరు డిస్టెన్స్ ని కొలవాలి అనుకున్న రెండో లొకేషన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ మీరు మల్టిపుల్ పాయింట్స్ మధ్య దూరాన్ని కొలవాలి అనుకుంటే అప్పుడు ఆ అన్ని లొకేషన్స్ లలో క్లిక్ చేయవచ్చు.
5: దీని తరువాత, దూరాన్ని గుర్తించడానికి మీరు దానిని అడ్జస్ట్ చేయడానికి ఒక పాయింట్ ని డ్రాగ్ చేయాలి. మీరు పాయింట్ ని డ్రాగ్ చేసిన వెంటనే మీ పేజీ బాటమ్ లో ఉన్న ప్రాంతాల మధ్య దూరాన్ని Google మ్యాప్స్ చూపిస్తుంది.
స్మార్ట్ ఫోన్ లో
మీరు కూడా మీ Android లేదా iOS స్మార్ట్ ఫోన్ లో అదే పని చేయవచ్చు. అయితే, మీరు ఒక స్మార్ట్ఫోన్లో దీన్ని చేసేటప్పుడు ఈ ప్రక్రియ కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
1: Google Maps ఆప్ తెరవండి.
2: ఇప్పుడు మొదటి పాయింట్ ని గుర్తించి రెడ్ పిన్ తో మార్క్ చేయండి.
3: దీని తరువాత, మ్యాప్ కింద వైపు ప్లేస్ పేరుపై టాప్ చేయండి.
4: ఇప్పుడు పాప్-అప్ మెనూ నుండి మెజర్ డిస్టెన్స్ ని సెలెక్ట్ చేసుకోండి.
5: ఇప్పుడు మీరు మ్యాప్ ని డ్రాగ్ చెయ్యాలి, తద్వారా బ్లాక్ సర్కిల్ మీరు యాడ్ చేయవలసిన నెక్స్ట్ పాయింట్ పైన ఉంటుంది.
6: Add + ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు అప్లికేషన్ లో మల్టీపుల్ పాయింట్లను యాడ్ చేయొచ్చు.
7: ఇలా చేయడం వల్ల మీరు ఇప్పుడు మొత్తం దూరాన్ని మైల్స్ లేదా కిలోమీటర్లలో మొత్తం దూరాన్ని కింద వైపు గమనించవచ్చు.
సో ఒకసారి ఈ Google Maps ట్రిక్ ట్రై చేయండి, పెట్రోల్ సేవ్ చేయండి.