Driving License: డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయారా.? అయితే ఇలా చేయండి.. ఫైన్ పడదు!
Driving License: Have you forgotten your driving license at home? But do this.. it will not be fine!
If we bring a vehicle on the road, we must have a driving license. Otherwise the traffic police will issue a challan. Have you ever forgotten your driving license at home?
If caught in the police checks..? Do this to avoid the traffic police issuing a challan.. It doesn't matter if you don't have a license or RC.. this one app is enough. Let's find out what it is.
రోడ్డుపైకి వాహనం తీసుకుని వస్తే.. కచ్చితంగా మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే. లేదంటే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారు. మరి మీరు ఎప్పుడైనా మీ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇంట్లో మర్చిపోయి.?
పోలీసుల తనిఖీల్లో చిక్కుకున్నట్లయితే..? ట్రాఫిక్ పోలీసులు చలానా వేయకుండా బయటపడేందుకు మీరు ఇలా చేయండి.. మీ దగ్గర లైసెన్స్, ఆర్‌సీ లేకపోయినా పర్లేదు.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు. మరి అదేంటో తెలుసుకుందాం.
‘Digi Locker’.. ఈ యాప్‌లో మీరు ముఖ్యమైన డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, బీమా లాంటి పత్రాలు సులభంగా ఇందులో సేవ్ చేసుకోవచ్చు. మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పోలీసు చెకింగ్ దగ్గర ఆపినట్లయితే.. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా.. ఈ డిజిలాకర్ యాప్‌లోని DL హార్డ్ కాపీని చూపిస్తే చాలు..
కాగా, డిజిటల్ ఇండియాను దృష్టిలో పెట్టుకుని వాహనం నడపటానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ను ఒకే చోట పొందేలా పలు యాప్‌లు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అవే Digilocker, mParivahan మొబైల్ యాప్‌లు. 2018 సంవత్సరంలో, భారత ప్రభుత్వ రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ డిజిలాకర్, mParivahan మొబైల్ యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను అసలైనవిగా నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది.