పొదుపు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ నుంచి 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.

 EPFO: పీఎఫ్‌ విత్‌ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు. పెళ్లి కోసం కూడా.

EPFO: Withdrawing PF? In this case 75 percent can be taken. Even for marriage.

EPFO: Withdrawing PF? In this case 75 percent can be taken. Even for marriage.

It is well known that the Employees Provident Fund Organization (EPFO) is a statutory body in India that manages the Employees' Provident Fund.

This is a type of savings that is very useful after the employee retires. But in some cases there is flexibility to take some provident fund. For you, more details about the fund can be taken before the employee retires and how much percentage can be taken.

భారత దేశం చట్టబద్దమైన 'ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్' (EPFO) సంస్థ ఉద్యోగుల భవిష్య నిధిని నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఇది ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత ఎంతగానో ఉపయోగపడే ఒక రకమైన పొదుపు. అయితే కొన్ని సందర్భాల్లో కొంత ప్రావిడెంట్ ఫండ్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఉద్యోగి పదవి విరమణ పొందకముందే ఎలాంటి సందర్భాల్లో ఫండ్ తీసుకోవచ్చు, ఎంత శాతం తీసుకోవచ్చనే మరిన్ని వివరాలు మీ కోసం..

నిరుద్యోగం విషయంలో.

పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఏదైనా సందర్భంలో తన ఉద్యోగం కోల్పోతే, లేదా ఉద్యోగం లభించకుండా ఎక్కువ కాలం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పటికే పొదుపు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్ నుంచి 75 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళా నిరుద్యోగ సమయం రెండు నెలలకంటే ఎక్కువ ఉంటె మిగిలిన 25 శాతం కూడా తీసుకోవచ్చు.

ఉన్నత చదువుల కోసం.

పిఎఫ్ అకౌంట్ ఉన్న వ్యక్తి ఉన్నత చదువులు చదవటానికి, లేదా 10వ తరువాత పిల్లల విద్యా ఖర్చులను భరించడానికి 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు.

వివాహం కోసం

ఈ ఆధునిక కాలంలో పెళ్లి ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి, కావున ఉద్యోగులు తమ పెళ్లి ఖర్చుల కోసం కూడా తమ పిఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును 50 శాతం తీసుకోవచ్చు. దీని కోసం ఖచ్చితమైన వివరాలు అందించాల్సి ఉంటుంది.

వికలాంగుల కోసం

పిఎఫ్ ఖాతా కలిగిన వికలాంగులు 6 నెలల విలువైన బేసిక్ పే & డియర్‌నెస్ అలవెన్స్ లేదా వడ్డీతో కూడిన ఉద్యోగుల వాటాను 2023 నిబంధనల ప్రకారం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది ఖరీదైన పరికరాలను కొనుగోలు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యేకంగా వారి ఆర్ధిక ఇబ్బందులను తగ్గించడానికి ఉద్దేశించబడింది.

వైద్య అవసరాల కోసం

పిఎఫ్ అకౌంట్ కలిగిన ఉద్యోగి అనుకోని పరిస్థితుల్లో రోగాల భారిన పాడినప్పుడు వైద్యం చేయించుకోవడానికి డబ్బుని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది సొంత వైద్య ఖర్చుల కోసం లేదా కుటుంబ సభ్యుల చికిత్స కోసం ఉపయోగించుకోవచ్చు. ఆరు నెలల బేసిక్ పే, డియర్‌నెస్ అలవెన్స్ లేదా ఉద్యోగి వాటాతో పాటు వడ్డీని తీసుకోవచ్చు.

ఇల్లు లేదా భూమిని కొనుగోలు కోసం

ఖాతాదారుడు భూమిని కొనుగోలు చేయడానికి లేదా నివాస గృహాలు కొనుగోలు చేయాలనుకున్నప్పుడు కూడా పిఎఫ్ బ్యాలెన్స్ విత్‌డ్రా చేసుకోవచ్చు. నిబంధనలకు అనుగుణంగా మాత్రమే దీనిని విత్‌డ్రా చేసుకోవడం సాధ్యమవుతుంది.

ఇంటి మరమ్మత్తుల (Home Renovation) కోసం

వివాహం, వైద్య ఖర్చులు మొదలైన వాటికి మాత్రమే కాకుండా కొత్త ప్రావిడెంట్ ఫండ్ నిబంధనల ప్రకారం.. హోమ్ రెనోవేషన్ కోసం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందులో 12 నెలల బేసిక్ పే & డియర్‌నెస్ అలవెన్స్‌తో పాటు ఉద్యోగి వాటాలో తక్కువ మొత్తం తీసుకోవచ్చు.

Share on Google Plus

About TefZa

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.