Do you know the causes of blood clots in winter?
చలికాలంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఏంటో తెలుసా?
శీతాకాలంలో జలుబు, దగ్గులు చాలా ఇబ్బంది పెడతాయి. వీటితోపాటు చలికాలంలో రక్తంగడ్డకట్టే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శీతాకాలంలో శరీరం లోపల రక్తం చిక్కబడడం వల్ల గుండెపోటుకు గురయ్యే అవకాశముందని డాక్టర్లు చెబుతున్నారు. అందుకే ఈ కాలంలో రక్తం గడ్డకట్టే ఆహారాల జోలికి పోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. అసలు ఈ కాలంలో రక్తం ఎందుకు గడ్డకడుతుంది? వాటికి కారణాలేంటో తెలుసుకుందామా..?!
- శరీరంలో రక్తం గట్టిపడే సమస్యను హూపర్‌కోగ్యులబిలిటీ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో రక్తహీనత వల్ల కణజాలం దెబ్బతింటుంది. రక్తం గడ్డకట్టడానికి వివిధ కారణాలున్నప్పటికీ మద్యపానం, ధూమపానం వంటి అలవాట్ల వల్ల రక్తం చిక్కబడి, గడ్డకట్టడానికి కారణమవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
- చల్లని వాతావరణం కారణంగా రక్త నాళాలు కుంచించుకుపోతాయి. అందుకే వింటర్ సీజన్లో ఎక్కువ మంది గుండెపోటుకు గురి అవుతుంటారు. రక్తం చిక్కబడటం వల్ల అధిక రక్తపోటు సమస్యకు దారితీస్తుంది. అలాగే విపరీతమైన చలి కారణంగా రక్తం చిక్కగా మారుతుంది. రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచుతుంది.
- చలికాలంలో శరీరంలో రక్తం గడ్డకట్టడం సహజం. అయితే గడ్డకట్టిన లక్షణాలు మాత్రం ముందస్తుగా కనిపించవు. కొన్నిరోజుల తర్వాత కంటిచూపు మందగించడం, తలనొప్పి, తల తిరగడం, విపరీతంగా చెమటలు పట్టడం, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అధిక రక్తపోటు, చర్మంపై గాయాలు, బహిష్టు సమయంలో అధిక రక్తస్రావం, చర్మం దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- విటమిన్ కె రక్తాన్ని చిక్కగా మారుస్తుంది. బచ్చలికూర, బ్రోకలీ, సోయాబీన్స్, గుమ్మడికాయల్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. శీతాకాలంలో ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

